Bigg Boss Telugu 7: అమర్‌ దీప్‌కి ఆ కోరిక తీరకుండా చేసిన శివాజీ.. చేతులెత్తి వేడుకున్నా వినలేదు?

Published : Nov 24, 2023, 05:35 PM IST
Bigg Boss Telugu 7: అమర్‌ దీప్‌కి ఆ కోరిక తీరకుండా చేసిన శివాజీ.. చేతులెత్తి వేడుకున్నా వినలేదు?

సారాంశం

బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లో కెప్టెన్ అయ్యేందుకు ఇదే చివరి అవకాశం. అందులో అమర్‌, అర్జున్‌లకు అవకాశం వచ్చింది. కానీ శివాజీ బిగ్‌ హ్యాండిచ్చాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ 12వ వారం నడుస్తుంది. మరో రెండు రోజులతో ఈ వారం ముగుస్తుంది. హౌజ్‌లో ఈ వారం మాత్రమే కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ ఉందని మొన్న హోస్ట్ నాగ్‌ చెప్పారు. అయితే హౌజ్‌లో ఉన్నవారిలో అమర్‌ దీప్‌, అశ్విని, రతికలు ఇప్పటి వరకు కెప్టెన్‌ కాలేదు. దీంతో వారికి ఈ ఒక్క ఛాన్సే ఉంది. నిరూపించుకోవాలని తెలిపారు. ఆ మేరకు హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అయితే చివరగా పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుందట. అసలు కెప్టెనే లేకుండా అయిపోయిందట. 

కెప్టెన్సీ టాస్క్ లో చివరగా అర్జున్‌, అమర్‌ దీప్‌ ఉన్నారు. వారికి శివాజీ, శోభా శెట్టి సపోర్ట్ చేసే అవకాశం లభించింది. అయితే ఈ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లు కెప్టెన్‌ అవుతారు. శివాజీ కెప్టెన్‌ అవడంలో అమర్‌ దీప్‌ సపోర్ట్ చేశాడు. కానీ ఇప్పుడు అమర్‌కి పెద్ద ఝలక్‌ ఇచ్చాడు శివాజీ. ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదట. ఆయన అర్జున్‌ వైపు నిలబడ్డాడని తెలుస్తుంది. శోభా.. అమర్‌ కోసం నిలబడింది. ఇందులో ఇద్దరు ఒకరిని షూట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ శివాజీ, శోభా ఆ పని చేయలేకపోయారట. 

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో తనకు అవకాశం ఇవ్వండి అన్నా అంటూ అమర్‌ దీప్‌ వేడుకున్నాడు. రిక్వెస్ట్ చేశాడు. చాలా బ్రతిమాలాడు. కానీ శివాజీ ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గత వారం నీకు సపోర్ట్ చేశానని కానీ ఇప్పుడు ఇవ్వలేను అని తెలిపారు. అర్జున్‌ వైఫ్‌ ప్రెగ్నెంట్‌తో ఉందని, ఆమె కోరిక అని చెప్పాడు. ఈ క్రమంలో అమర్‌ దీప్ చాలా దిగిపోయి వేడుకున్నాడు. దెండం పెడతా అన్నా సపోర్ట్ ఇవ్వండి అంటే బతిమాలుకున్నా శివాజీ వినలేదు. 

ఫైనల్‌ నిర్ణయం వెల్లడించే విషయంలో బిగ్‌ బాస్‌ చాలా సమయం ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎలాంటి మార్పు, ఫలితం లేకపోవడంతో పెద్ద షాకిచ్చాడు. ఈ వారం అసలు కెప్టెన్‌ లేడని ప్రకటించినట్టు తెలుస్తుంది. చివరి కెప్టెన్‌ అవకాశం కోల్పోయినట్టు సమాచారం. మొత్తంగా అర్జున్‌ ఆల్‌రెడీ కెప్టెన్‌ అయ్యాడు. కానీ అమర్‌ దీప్‌కి వచ్చిన ఛాన్స్ ఇలా మిస్‌ అయిపోయింది. కెప్టెన్‌ కావాలనే అమర్‌ దీప్‌ కోరిక అలానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. మరి నిజంగానే కెప్టెన్‌ లేకుండా హౌజ్‌ని నడిపిస్తారా? లేక రేపు శనివారం వచ్చే హోస్ట్ నాగార్జున కెప్టెన్‌ని నిర్ణయిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రియాంక కెప్టెన్‌గా ఉన్నారు.

ఇక ఈ వారం నామినేషన్లలో శివాజీ, ప్రశాంత్‌, అర్జున్‌, అమర్‌ దీప్‌, అశ్విని, గౌతమ్‌, రతిక, యావర్‌ ఉన్నారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుంది. మరి వీరిలో ఏ ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. రతిక, అశ్విని, గౌతమ్‌ ముగ్గురిలో ఒకరు హౌజ్‌ని వీడే అవకాశం ఉందని తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం