బిగ్ బాస్ హౌజ్ లో ప్రస్తుతం అమర్ దీప్ ఇంట్రెస్టింగ్ గా మారారు. కొన్ని వారాలుగా ఆయన ఆటతీరుగా మెరుగ్గా కనిపిస్తోంది. మంచి రెస్పాన్స్ వస్తున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీనిపై అతని స్నేహితుడు ఒకరు క్లారిటీఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Telugu 7)లో కంటెస్టెంట్ అమర్ దీప్ (Amardeep) ఆటతీరు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పది వారాల వరకు ఇంటికే అన్నట్టుగా ఆడిన అమర్ ఆ తర్వాత వీక్ నుంచి తన ఆటతీరును మార్చి చూపించారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. హౌజ్ మేట్ల నుంచి వచ్చిన మాటలనూ తన మదిలో దాచుకుంటున్నారు. పెద్దగా కోపతాపాలకు వెళ్లడం లేదు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లోనూ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపారు. ఫుల్ ఫన్ జనరేట్ చేస్తన్నారు.
అయితే, తాజాగా అమర్ దీప్ ను బిగ్ బాస్ మెడికల్ రూమ్ కు పంపించారని, అతను అస్వస్థతకు గురవడంతో ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. సెలైన్లు కూడా ఎక్కుతున్నాయని అంటున్నారు. కాగా, అమర్ కు ఫిట్స్ వచ్చిందంటూ బయట మాత్రం తెగ ప్రచారం జరుగుతోంది. వచ్చే వారం తను ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం. అయితే, తాజాగా అమర్ స్నేహితుడు, జానకీ కలగనలేదు డైలీ సీరియల్ నటుడు నరేష్ లొల్ల (Naresh Lolla) స్పందిచారు. అమర్ కు ఫిట్స్ అంటూ వస్తున్న వార్తలను నిజమేనని స్పష్టం చేశారు.
undefined
తాజాగా ఇంటర్వ్యూలో అమర్ ఆరోగ్య సమస్యల గురించి నరేశ్ మాట్లాడారు. అమర్ కు ఫిట్స్ అని వచ్చే వార్తలు నిజమే. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిపై అమర్ బయటికి వచ్చాక పూర్తిగా మాట్లాడుతాను. అమర్ కు ఇప్పుడు కాదు.. ‘నీతోనే డాన్స్’ షోలో ఉన్నప్పుడే మొదలైంది. ఆ షో చేయడం ద్వారా అమర్ ఫిజికల్ గా, మెంటల్ గా బాగా ఒత్తిడికి లోనయ్యాడు. నిద్రలేకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని నేనే డాక్టర్ కు చూపించాను. కొన్ని టెస్టులు చేసిన తర్వాత అమర్ కు కండరాల ఎదుగదల లేదని తెలిసింది. మజిల్ గ్రోత్ లేకపోవడంతో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాడు. అందుకే శరీరం సహకరించడం లేదు. అయినా అమర్ ఆ విషయాన్ని చెప్పలేదని, గేమ్ లోనూ అది చూపించలేదని చెప్పుకొచ్చారు.