వైరల్ వీడియో: స్టేజీపై ‘జైలర్‌’ సీక్వెన్స్ ప్లే చేసి దుమ్ము రేపిన శివన్న

Published : Aug 22, 2023, 12:12 PM IST
 వైరల్ వీడియో: స్టేజీపై  ‘జైలర్‌’ సీక్వెన్స్ ప్లే చేసి దుమ్ము రేపిన శివన్న

సారాంశం

 ‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ మాత్రమే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ జాకీష్రాఫ్, తెలుగు కమెడియన్ సునీల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. 


రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. అందులో శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రకు కూడా అలాంటి ప్రశంసలే వస్తున్నాయి. 'జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ నరసింహ అనే అతిథి పాత్రలో మెరిశారు.  కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్‌ పాత్రకు ఏ స్దాయిలో ప్రశంసలు వస్తున్నాయో అదే స్దాయిలో శివన్న నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. దాంతో ఆయన ఓ టీవి షోకు వెళ్లారు. అక్కడ స్టేజిపై ఆ సీక్వెన్స్ ని ప్లే చేసారు. ఆయన ఫెరఫార్మెన్స్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో  ఈవీడియో వైరల్ అవుతోంది. 
  

  శివరాజ్ కుమార్ తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా అతని మాస్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తమిళ సినీ ప్రియులు కూడా శివన్న నటనకు ఫిదా అవుతున్నారు.ఇందులో భాగంగా సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన శివరాజ్ కుమార్‌ని కలిసి బహుమతులు ఇచ్చారు. ‘జైలర్’ చిత్రాన్ని కర్ణాటకలో పంపిణీ చేసిన జయన్న, వెంకటేష్‌లు  శివరాజ్‌కుమార్‌ను కలిశారు. శివన్నను శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘జైలర్’ సినిమా కర్ణాటకలో మంచి వసూళ్లు సాధిస్తోందని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

 

 కాగా ‘జైలర్’ సినిమా విడుదలైన కొద్ది  రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఈ ఆనందాన్ని చిత్ర టీమ్ జరుపుకోకముందే కొందరు డిస్ట్రిబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు.  ఇక ‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ మాత్రమే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ జాకీష్రాఫ్, తెలుగు కమెడియన్ సునీల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. అయితే శివన్న పాత్ర బాగా ఎలివేట్‌ అయ్యింది. ముఖ్యంగా సినిమాలో శివన్న ఎంట్రీ సీన్, క్లైమాక్స్ సీన్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాకు నెల్సన్‌ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రలు పోషించారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ మరోసారి తన బీజీఎంతో అదరగొట్టాడు.
 

PREV
click me!

Recommended Stories

యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి...
Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే