#Mega156 కూతురే నిర్మాత కన్ఫర్మ్ పోస్టర్, డైరక్టర్ విషయంలో ట్విస్ట్

Published : Aug 22, 2023, 11:40 AM ISTUpdated : Aug 22, 2023, 02:22 PM IST
#Mega156 కూతురే నిర్మాత కన్ఫర్మ్ పోస్టర్, డైరక్టర్ విషయంలో ట్విస్ట్

సారాంశం

ఆయన కుమార్తె సుశ్మిత ప్రొడక్షన్ లో  కూడా సినిమా చేయాలి కాబట్టి ఆ పోస్టర్ వదిలారు. కానీ డైరక్టర్ పేరు మెన్షన్ చేయలేదు. అంటే కళ్యాణ్ కృష్ణతో ప్రాజెక్టు ఇంకా పెండింగ్ లోనే ఉందన్నమాట.

ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు కావటంతో ఆయన సినిమాలు చేస్తున్నవారు అప్డేట్స్ ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా భోళా శంకర్ వర్కవుట్ కాకపోవటంతో చిరంజీవి ప్రతీ ప్రాజెక్టుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా తను కథ విని ఓకే చేసిన ఇద్దరు డైరక్టర్స్ అయిన కల్యాణ్ కృష్ణ,  బింబిసార డైరక్టర్ వశిష్టలలో ఒకిరితోనే సినిమా ఎనౌన్స్ చేసారు. అదే వశిష్టతో సినిమా. అయితే ఆయన కుమార్తె సుశ్మిత ప్రొడక్షన్ లో  కూడా సినిమా చేయాలి కాబట్టి ఆ పోస్టర్ వదిలారు. కానీ డైరక్టర్ పేరు మెన్షన్ చేయలేదు. అంటే కళ్యాణ్ కృష్ణతో ప్రాజెక్టు ఇంకా పెండింగ్ లోనే ఉందన్నమాట.

వాస్తవానికి ఈ సినిమాతో తన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కెరీర్‌ని కూడా గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారు చిరంజీవి. ఆ మధ్య సుష్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు సంతోష్‌ శోభన్‌ హీరోగా ఓ సినిమాను కూడా నిర్మించింది. అయితే ఆ రెండూ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి. దీంతో నిర్మాతగా అడుగుపెట్టిన సుష్మితకు ఆదిలోనే అపజయాలు ఎదురయ్యాయి. 

ఈ క్రమంలో  ఎలాగైన తన కూతురిని నిర్మాతగా నిలబెట్టాలని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే తన తదుపరి సినిమా(Mega156)ను కూతురి నిర్మాణ సంస్థలోనే చేయనున్నారట. ఇప్పటికే ‘సైరా’తో తన కొడుకు రామ్‌ చరణ్‌ని నిర్మాతగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా తన సినిమాతో ఓ సూపర్‌ హిట్‌ అందించి,పెద్ద ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమాకు సుష్మితనే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి సంకాంత్రికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్టు ఉందా లేదో అనే సందేహంలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?