ఎన్టీఆర్ దేవర సినిమాపై అభిమానికి అనుమానం..? ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.

Published : Aug 22, 2023, 12:02 PM IST
ఎన్టీఆర్  దేవర సినిమాపై అభిమానికి అనుమానం..? ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.

సారాంశం

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ టైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈక్రమంలో ఈమూవీపై ఓ అభిమాని వ్యక్తం చేసిన అనుమానాన్ని దేవర టీమ్ ట్విట్టర్ లో తీర్చేసింది. ఇంతకీ ఆ అభిమాని అనుమానం ఏంటీ..? 

టాలీవుడ్ యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్  ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖసంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా  ఈసినిమాను నిర్మిస్తున్నారు.  దేవర  సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు  కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోతోంది.  

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూసేద్దామామ అని ఆత్రుతతో ఉన్నారు ఆడియన్స్. ఈక్రమంలో ఈ మూవీకి సబంధించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూ వస్తోంది. అయితే  అసలు విషయం ఏంటంటే..దేవర మూవీ సంబంధించిన నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యాక్తం చేస్తున్నారు. అందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు...దేవర మూవీ టీమ్.. అఫీషియల్ గా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆ అభిమాని ఏమని అడిగాడంటే.. 

దేవర సినిమా అన్ని భాషలతో పాటు  ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ కానుందా అంటూ సోషల్ మీడియాలో ఒకరు పెట్టిన పోస్ట్ కి.. దేవర టీమ్ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు దేవర అఫీషియల్ టీమ్. అది నిజం కాదని తెలిపారు.  దేవర మూవీ ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వడం లేదని అన్నారు.  కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఇక దేవర ని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు
రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?