రెండోసారి తండ్రైన శివకార్తికేయన్‌.. ఆ బాధని పోగొట్టిందంటూ కన్నీటితో భార్యకి థ్యాంక్స్

Published : Jul 12, 2021, 04:58 PM IST
రెండోసారి తండ్రైన శివకార్తికేయన్‌.. ఆ బాధని పోగొట్టిందంటూ కన్నీటితో భార్యకి థ్యాంక్స్

సారాంశం

తండ్రి ఫోటో ముందు తన వేలిని కొడుకు పట్టుకున్న ఉన్న ఫోటోని పంచుకున్నాడు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీంతో శివకార్తికేయన్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

తమిళ హీరో శివకార్తికేయన్‌ రెండోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య ఆర్తి సోమవారం పండంటి మగబిడ్డకి జన్మినిచ్చింది. ఈ విషయాన్ని శివకార్తికేయన్‌ వెల్లడించారు. సోషల్‌ మీడియా అకౌంట్‌ అయిన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. `18ఏళ్ల తర్వాత ఈ రోజు మా నాన్న నా చేయి పట్టుకున్నాడు. అది కూడా నా కొడుకు రూపంలో. ఎన్నో ఏళ్ల నుంచి నుంచి మోస్తూ వస్తున్న బాధని నా భార్య నేడు పోగొట్టింది. ఆమెకు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నార`ని ట్వీట్‌ చేశాడు శివకార్తికేయన్‌. 

ఈ సందర్భంగా తండ్రి ఫోటో ముందు తన వేలిని కొడుకు పట్టుకున్న ఉన్న ఫోటోని పంచుకున్నాడు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీంతో శివకార్తికేయన్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. `కుట్టి కార్తికేయన్‌ వచ్చాడని అంటూ `కుట్టిఎస్కే` యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరోవైపు సినీ తారలు సైతం శివకార్తికేయన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇదిలా ఉంటే శివకార్తికేయన్‌, ఆర్తిలకు 2013లో కుమార్తె ఆరాధన జన్మించారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రెండో సంతానంగా ఇప్పుడు కుమారుడు జన్మించడంతో శివకార్తికేయన్‌ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. `రెమో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ కి దగ్గరయ్యాడు శివకార్తికేయన్‌. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమాని తెలుగులో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. క్రమంగా టాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఆయన `డాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటించిన `డాక్టర్‌` సినిమా విడుదలకు రెడీగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్