ప్రైమ్‌లో వెంకీ `నారప్ప`.. రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌.. ఊపిరి పీల్చుకునే టైమ్‌..

Published : Jul 12, 2021, 04:32 PM IST
ప్రైమ్‌లో వెంకీ `నారప్ప`.. రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌.. ఊపిరి పీల్చుకునే టైమ్‌..

సారాంశం

`నారప్ప` సినిమా విడుదలపై సస్పెన్స్ కి తెరపడింది. ఎట్టకేలకు ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. 

విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న `నారప్ప` సినిమా విడుదలపై సస్పెన్స్ కి తెరపడింది. ఈ సినిమా థియేటర్‌లోనే అని నిర్మాతలు చెప్పడం, ఓటీటీలో వస్తుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం ఇలా గత కొన్ని రోజులుగా నడుస్తుంది. తాజాగా సస్పెన్స్ కి తెరపడింది. సినిమాని ఎట్టకేలకు ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ నెల(జులై) 20న  సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

ఇక ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేష్‌ సరసన ప్రియమణి నటిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్‌, వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇది తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొంది బ్లాక్‌ బస్టర్‌ అయిన `అసురన్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఆ చిత్ర నిర్మాత కళైపులి ఎస్‌ థాను తెలుగు రీమేక్‌లోనూ భాగమయ్యారు. అనంతపురం బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుంది. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ హీరో వెంకటేష్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `నా అభిమానులు, శ్రేయోభిలాషులు మా సినిమా `నారప్ప`ని చూసేందుకు ఈగర్ గా వెయిట్‌ చేస్తున్నారు. నాకు ఎక్స్ ట్రా మైల్‌నిచ్చే ఈ సినిమాపై మీకున్న ప్రేమ చాలా ఎక్కువ. మీ ప్రేమ ఇలానే ఇంకా పెరుగుతుందని భావిస్తున్నా. మీ సౌలభ్యం, భద్రతని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రైమ్‌లో విడుదల చేస్తున్నాం` అని తెలిపారు.

 ప్రైమ్‌లో విడుదల సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ, `టాలెంటెడ్‌ నటీనటులు, అత్యంత క్రియేటివిటీ కలిగిన టెక్నీషియన్లతో పనిచేయడం ఉత్తేజకరమైన అనుభవం. `నారప్ప` కథ నా మనసుకి దగ్గరైన కథ. అంతేకాదు ఇది మొత్తం వ్యవస్థపై సామాజిక వ్యాఖ్యానాన్ని కూడా వివరిస్తుంది. సినిమా విడుదల కావడమనేది ఊపిరి పీల్చుకునే విషయం. గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ కలిగిన ప్రైమ్‌లో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ యాక్షన్‌ ప్యాక్డ్ చిత్రాన్ని అందరు చూసి ఆనందిస్తారని భావిస్తున్నా` అని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు