Director Bala: బిగ్ షాక్.. భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్, 17 ఏళ్ల బంధానికి ముగింపు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 08, 2022, 12:16 PM IST
Director Bala: బిగ్ షాక్.. భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్, 17 ఏళ్ల బంధానికి ముగింపు

సారాంశం

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాల గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. తమిళ సినిమాలతో బాల స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. 

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాల గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. తమిళ సినిమాలతో బాల స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. బాల తెరకెక్కించే చిత్రాలు ఎమోషనల్ కంటెంట్ తో విలక్షణంగా ఉంటాయి. అందుకే బాల విభిన్నమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా తాజాగా బాల పర్సనల్ లైఫ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 

డైరెక్టర్ బాల తన భార్య ముధుమలార్ తో విడిపోతూ విడాకులు తీసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ వార్త సంచలనంగా మారింది. ఇటీవల చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలుగులో సమంత, చైతు.. కొన్ని రోజుల క్రితం ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా బాల, మధుమలార్ డివోర్స్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు బాల, ముధుమలార్ మధ్య నాలుగేళ్ళ క్రితమే విభేదాలు మొదలయ్యాయట. అప్పటి నుంచి వీరిద్దరూ విడిగానే ఉంటున్నారట. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టు లో ఇద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ అధికారికంగా విడిపోయారు. 

బాల, ముధుమలార్ లకు అందమైన కుమార్తె ప్రార్థన ఉంది. వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణాలు మాత్రం తెలియడం లేదు. బాల, మధుమలార్ ఇద్దరూ 2004లో మధురైలో వివాహం చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది. 

బాల తెరకెక్కించే చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటాయి. సూర్య, విక్రమ్ కలసి నటించిన శివ పుత్రుడు (పితామగన్) చిత్రం సంచలనం సృష్టించింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉండగా బాల తదుపరి చిత్రం హీరో సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu: శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయట పెడతా.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విశ్వక్
రామ్ చరణ్ కి స్కూల్లో మార్కులు తక్కువ రావడానికి కారణమైన మరో హీరో ఎవరో తెలుసా?