రూ.10 కోట్లు ఇస్తాం ఓకేనా.. చెప్పుతో కొట్టినట్లు హీరోయిన్ సమాధానం!

Published : Aug 18, 2019, 05:01 PM IST
రూ.10 కోట్లు ఇస్తాం ఓకేనా.. చెప్పుతో కొట్టినట్లు హీరోయిన్ సమాధానం!

సారాంశం

సినీ తరాలకు స్టార్ స్టేటస్ వస్తే సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి. కేవలం సినిమాల సంపాదన మాత్రమే కాక కార్పొరేట్ సంస్థలు భారీ ఆఫర్లతో స్టార్ల వెంటపడతాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేస్తాయి. చాలా మంది హీరోలు, హీరోయిన్లు బడా కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

అలాంటి వారిలో కూడా విలువలు పాటించే స్టార్లు ఉన్నారు. తాము ప్రచారం కల్పించే ఉత్పత్తి విషయంలో సంతృప్తి చెందితేనే డీల్ ఒకే చేయడం లేకుంటే కొన్ని రకాల ఉత్పత్తులకు దూరంగా ఉండడం లాంటి నియమాలు పాటిస్తారు. ఇదిలా ఉండగా పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి నాజూకు అందానికి మారుపేరు. 

శిల్పా శెట్టి నాలుగు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో ఉంది. గతంలో శిల్పా శెట్టి ఆహార నియమాలు పాటిస్తూ, యోగా చేస్తూ ఫిట్ నెస్ తో ఉంటోంది. గతంలో శిల్పా శెట్టి యోగా వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉండగా ఓ కార్పొరేట్ సంస్థ భారీ ఆఫర్ తో శిల్పా వద్దకు వెళ్లిందట. 

తాము తయారు చేసే స్లిమ్ పిల్ కు ప్రచారం కల్పించాలని కోరిందట. అందుకోసం వారు శిల్పా కు 10 కోట్లు ఆఫర్ చేశారు. ఈ పిల్ ఉపయోగిస్తే ఎలాంటి వ్యాయామాలు లేకుండానే స్లిమ్ గా మారతారు అని సదరు సంస్థ శిల్పా శెట్టికి తెలిపింది. సైడ్ ఎఫెక్ట్స్, ఇతర కారణాల వల్ల ఇలాంటి ఉత్పత్తులని తాను నమ్మనని శిల్పా శెట్టి తెగేసి చెప్పిందట. 

ఎంత డబ్బిచ్చినా నేను ఈ యాడ్ చేయను. నేనే నమ్మని వాటిపై నేనెలా ప్రచారం కల్పిస్తాను అని శిల్పా అదిరిపోయే సమాధానం ఇచ్చి వారి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. శిల్పా శెట్టి నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్