జనసేన ఓటమిపై మెగాస్టార్ కామెంట్.. పవన్ కి ఆ సత్తా ఉంది!

Published : Aug 18, 2019, 04:27 PM IST
జనసేన ఓటమిపై మెగాస్టార్ కామెంట్.. పవన్ కి ఆ సత్తా ఉంది!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోంది. రాంచరణ్ 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.   

ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోతో సైరా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్ కోసం స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓటమి గురించి ప్రశ్న ఎదురవగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

రాజకీయాలనేవి సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, ఓటములు ఎదురవుతాయి. జనసేన పార్టీని విజయపథంలో నడిపించే సత్తా పవన్ కళ్యాణ్ కు ఉంది అని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. 

తనకు బిజెపి నుంచి ఆహ్వానం అందుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై కూడా చిరు స్పందించారు. నేను ఆ పార్టీలో చేరాలనేది వాళ్ళ కోరిక. దీనిపై నేనెలా స్పందించగలను. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే అని చిరంజీవి తెలిపారు. 

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నికల్లో 18 సీట్లు సాధించారు. ఆ తర్వాత 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న