పోర్నోగ్రఫీ కేసు: జీవితంలో పొరపాటు చేశా.. నిగూఢంగా శిల్పా శెట్టి హాట్ కామెంట్స్

By telugu teamFirst Published Aug 27, 2021, 4:36 PM IST
Highlights

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తర్వాత శిల్పా శెట్టి ఫ్యామిలీ మీడియాలో వార్తల్లో కెక్కింది. ఒక రకంగా రాజ్ కుంద్రా కేసు శిల్పా శెట్టి ఫ్యామిలీకి పరువు సమస్యగా మారింది. 

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తర్వాత శిల్పా శెట్టి ఫ్యామిలీ మీడియాలో వార్తల్లో కెక్కింది. ఒక రకంగా రాజ్ కుంద్రా కేసు శిల్పా శెట్టి ఫ్యామిలీకి పరువు సమస్యగా మారింది.  మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇలా శిల్పా శెట్టి ఫ్యామిలీ వేదన అనుభవించింది. 

ఇప్పటికీ రాజ్ కుంద్రా కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు తర్వాత శిల్పా శెట్టి ఫ్యామిలీ మీడియాకు కూడా ముఖం చూపించలేదు. తన భర్త గురించి శిల్పా శెట్టి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే తన భర్త పోర్న్ చిత్రాలని నిర్మించడం, ఇలా కుటుంబ పరువుని వీధిలోకి ఈడ్చడం పట్ల మాత్రం ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. 

తాజాగా శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఎక్కడా తన భర్త గురించి కానీ, కేసు గురించి కానీ డైరెక్ట్ గా మాట్లాడకుండా నిగూఢ వ్యాఖ్యలు చేసింది. నేను జీవితంలో పొరపాట్లు చేశాను. చేస్తూ ఉంటాను. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ, నన్ను నేను క్షమించుకుంటూ ముందుకు వెళతాను. 

పొరపాట్లు లేకుండా జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుకోలేము. కానీ ఆ పొరపాట్లు ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రమాదకరమైనవిగా ఉండకూడదు. ఆ పొరపాట్ల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం అని శిల్పా శెట్టి ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. 

ఇంతకీ శిల్పా శెట్టి ఈ వ్యాఖ్యల ద్వారా ఎం చెప్పాలనుకుంది.. ఆమె వ్యాఖ్యలు అర్థం కాని విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు. తన భర్తని సమర్థిస్తోందా.. అసలింతకీ శిల్పా శెట్టి చేసిన తప్పు ఏంటి ? ఇవన్నీ శిల్పా శెట్టి లేటెస్ట్ పోస్ట్ ద్వారా తలెత్తిన ప్రశ్నలు.   

 

click me!