మహా సముద్రం రిలీజ్ డేట్ ఫిక్స్

Published : Aug 27, 2021, 04:16 PM IST
మహా సముద్రం రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా నేడు మహా సముద్రం మూవీ విడుదల తేదీ ప్రకటించారు.

శర్వానంద్ , సిద్దార్థ్ హీరోలుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మహా సముద్రం. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా మహాసముద్రం తెరకెక్కుతుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే మహా సముద్రం మూవీపై పరిశ్రమలో పోసిటివ్ బజ్ ఉంది. 2018లో విడుదలైన ఆర్ ఎక్స్ 100 మూవీతో భారీ హిట్ అందుకున్న అజయ్ భూపతి..చాలా గ్యాప్ తరువాత మహా సముద్రం మూవీ చేస్తున్నారు. 


ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న మహా సముద్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా నేడు మహా సముద్రం మూవీ విడుదల తేదీ ప్రకటించారు. అక్టోబర్ 14న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో శర్వానంద్, సిద్దార్థ్ గన్స్ తో ఒకరిపై మరొకరు ఎక్కుపెట్టుకొని ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఆసక్తిపోరులా మహా సముద్రం ఉంటుందన్న భావన కలుగుతుంది. 


మహా సముద్రం చిత్రంలో అను ఇమ్మానియేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్,  రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్