
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులు, ఫాలోవర్స్ కోసం ప్రేరణాత్మక పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. అలాగే ఫిట్ నెస్ కు సంబంధించిన స్పెషల్ వర్క్ అవుట్స్ పోస్టులతో తన క్రేజ్ పెంచుకుంది. అయితే ఉన్నట్టుండి శిల్పా శెట్టి సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించడం చర్ఛనీయాంశంగా మారింది.
అయితే, తాజాగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ట్విటర్ మరియు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది శిల్పా. ‘ఏకాభిప్రాయాలతో చాలా విసుగు చెందాను.. అంతా ఒకేలా కనిపిస్తోంది. నేను కొత్తదనాన్ని ఫీలయ్యేంత వరకు సోషల్ మీడియా నుండి దూరంగా ఉంటాను’ అని ట్వీట్ లో పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు కొందరు అప్సెట్ అవుతున్నారు. ఇప్పటికే శిల్పాకు ట్విటర్ లో 6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అదే విధంగా ఇన్ స్టాలో 25.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా 32 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేయడానికంటే ముందు ఓ వ్యక్తిని గురించి సుధీర్ఘమైన నోట్ తో పోస్ట్ పెట్టింది శిల్పా. ‘మేము ప్రత్యేకమైనవారమని ఎల్లప్పుడూ చెబుతాం. కాబట్టి, వేరొకరి ప్రవర్తనను అనుకరించడానికి లేదా పునరావృతం చేయడానికి ప్రయత్నించడంలో అర్ధం కాదు. మన స్వంత వ్యక్తిత్వాలతోనూ కొంత మంచి, కొంత చెడు జరుగుతుంటుంది. ఎవ్వరూ పరిపూర్ణం కాదు. కాబట్టి మంచి క్వాలిటీస్ ను పెంపొందిద్దాం. ప్రతి రోజు మనల్ని మనం ఉత్తములుగా తీర్చిదిద్దుకుందాం’ అంటూ నోట్ లో పేర్కొంది.
ఇక గత ఏడాది శిల్పా భర్త రాజ్ కుంద్రా కూడా తన సోషల్ మీడియాకు దూరమయ్యారు. అశ్లీల కంటెంట్ కేసులో బెయిల్‌పై విడుదలైన వెంటనే, రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లను డీయాక్టివేట్ చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగానే ఉంటున్నాడు. అశ్లీల చిత్రాల వీడియోల డిస్టిబ్రూషన్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా గతేడాది డిసెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసుపై ఆయన ఒక సందర్భంలో స్పందిస్తూ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈ నిందారోపణను ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు.