Shekar Movie: జీవిత డబ్బులు ఎగ్గొట్టే రకం... అసలు వడ్డీ వసూలు చేసేదాకా వదలను... ఫైనాన్సియర్ సంచలన కామెంట్స్ 

Published : May 23, 2022, 01:52 PM IST
Shekar Movie: జీవిత డబ్బులు ఎగ్గొట్టే రకం... అసలు వడ్డీ వసూలు చేసేదాకా వదలను... ఫైనాన్సియర్ సంచలన కామెంట్స్ 

సారాంశం

హిట్ టాక్ తెచ్చుకున్న శేఖర్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది.కోర్టు ఆదేశాలతో ప్రదర్శన నిలిపివేశారు. శేఖర్ మూవీపై స్టే తీసుకొచ్చిన ఫైనాన్సియర్ ఎం. పరంధామ రెడ్డి నటి జీవితా రాజశేఖర్ ని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.   

జీవితా రాజశేఖర్ (Jeevitha Rajashekar) కుటుంబానికి వివాదాలు పరిపాటిగా మారాయి. ఇటీవల ఓ మహిళ జీవితా రాజశేఖర్ తనను మోసం చేశారంటూ మీడియాకు ఎక్కారు. తనకు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేశారు. తాజాగా శేఖర్ మూవీ ఆర్ధిక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన ఎం. పరంధామ రెడ్డి చట్టపరమైన చర్యలకు దిగారు. తనకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించే వరకు శేఖర్ మూవీ ప్రదర్శన నిలిపివేసేలా కోర్ట్ ఆదేశాలు తీసుకొచ్చారు. దీంతో శేఖర్ మూవీ ప్రదర్శన ఆగిపోయింది. అలాగే శేఖర్ మూవీ దర్శకురాలు జీవితా రాజశేఖర్ పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.  

పరంధామ రెడ్డి (Paramdhama Reddy) మాట్లాడుతూ.. ''రెండున్నరేళ్ల క్రితం జీవితా రాజశేఖర్‌కు నేను రూ.65ల‌క్ష‌లు ఇచ్చాను. నెక్ట్స్ సినిమా శేఖర్ రిలీజ్‌కు వారం రోజుల ముందు తీసుకున్న డ‌బ్బులతో పాటు మంచి బెనిఫిట్ ఇస్తాన‌ని అన్నారు. మే 20న శేఖర్ మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. తర్వాత డబ్బుల కోసం వాళ్లింటికి పది సార్లు తిరిగాను. జీవిత పలకదు.. ఉల‌క‌దు. దాంతో నా ద‌గ్గ‌రున్న రికార్డ్స్‌తో సిటీ కోర్టులో కేసు వేశాను. కోర్టు శేఖర్ (Shekar Movie) సినిమా నెగిటివ్ రైట్స్ మీద ఎటాచ్ చేస్తూ తీర్పునిచ్చింది. నాకు తెలిసి ఆమె ఇంత వ‌ర‌కు ఆమె చెల్లించాల్సిన మొత్తం చెల్లించ‌లేదు. సోమ‌వారం రోజున జీవితా రాజ‌శేఖ‌ర్‌పై కంటెంట్ ఆఫ్ కోర్టు కేసుని వేయ‌బోతున్నాం.నేను ఇంత‌కు ముందు రాజ‌శేఖ‌ర్‌తో మ‌హంకాళి సినిమాను నిర్మించాను. ఆ ప‌రిచ‌యంతోనే నేను డ‌బ్బులు ఇచ్చాను. నాకు మ‌హంకాళి సినిమాతోనే చేదు అనుభ‌వం ఉంది. కానీ మ‌ళ్లీ వ‌చ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు.

 క‌చ్చితంగా సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని బ్ర‌హ్మాండ‌మైన బెనిఫిట్ ఇస్తామ‌ని చెప్ప‌టంతో నేను కూడా డ‌బ్బులు ఇచ్చాను. ఆ డ‌బ్బులు అడిగితే త‌ర్వాత ఇస్తానంటూ పోస్ట్ పోన్ చేస్తూ వ‌స్తుంది. ఆమె డ‌బ్బులు తీసుకుంటే ఎగ్గొట్టే ర‌కం. ఇప్ప‌టికే న‌గ‌రి కోర్టులో మ‌రొక‌రు జీవిత‌పై కేసు వేశారు. ఆ కేసులో జీవిత‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇక నా డ‌బ్బుల విష‌యంలో రాజ‌శేఖ‌ర్‌, జీవిత ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు.ఛాంబ‌ర్‌లో ఈ విష‌యంపై కంప్లైంట్ ఇవ్వ‌లేదు. ఎందుకంటే ఛాంబ‌ర్ ఇష్యూ సెటిల్ కాదు. జీవిత‌ను డ‌బ్బులు చెల్లించ‌మ‌ని వారు డైరెక్ట్ చేయ‌లేరు. ఇంత‌కు ముందు మహంకాళి సినిమాలోనూ జీవిత నన్ను మోసం చేసింది. కాబట్టి నేను గడువు కూడా ఇవ్వను. ఆమె తత్వం నాకు తెలుసు. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాను. అసలు 65 లక్షలు, వడ్డీ 22 లక్షలు చెల్లించాల్సి ఉంది'' అన్నారు.

ఈ పరిణామం సినిమాకు చావు దెబ్బని చెప్పాలి. వీకెండ్ కోల్పోయిన శేఖర్ మూవీ పెట్టుబడి రాబట్టడం కష్టమే. వచ్చే వారం ఎఫ్3 మూవీ భారీగా విడుదల కానుంది. అంటే శేఖర్ మూవీని థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఒకవేళ డబ్బులు చెల్లించి, ప్రదర్శన స్టార్ట్ చేసినా ఫలితం ఉండదు. తమకు ఉన్నదంతా ఊడ్చి శేఖర్ మూవీ తెరకెక్కించినట్లు హీరో రాజశేఖర్ తెలిపారు. తాజా పరిస్థితులు చూస్తుంటే శేఖర్ మూవీ నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమస్య నుండి జీవితా రాజశేఖర్ ఫ్యామిలీ ఎలా బయటపడతారో చూడాలి.  

శేఖర్ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజశేఖర్ (Rajashekar)కూతురు శివాని కీలక రోల్ చేశారు. శేఖర్ చిత్ర నిర్మాతలుగా రాజశేఖర్ కుటుంబం వ్యవహరించింది. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?