‘సలార్’ తర్వాతే ‘ఆదిపురుష్’ అప్డేట్ రానుందా?.. ‘ఆదిపురుష్’ మేకర్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

Published : May 23, 2022, 01:24 PM IST
‘సలార్’ తర్వాతే ‘ఆదిపురుష్’ అప్డేట్ రానుందా?.. ‘ఆదిపురుష్’ మేకర్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ భారీ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన సినిమాల అప్డేట్స్ పట్ల కొంత నిరాశగానే ఉన్నారు. తమ అభిమాన హీరో అప్ కమింగ్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్న మేకర్స్ ఏండ్లుగా ఎలాంట  అప్డేట్స్ అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఇప్పటికే  ‘సలార్, ప్రాజెక్ట్ కే’ సినిమాల అప్డేట్స్ ను కోరుతూ మొన్నటి వరకు ఫ్యాన్స్ నెట్టింట రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హిందు మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ నుంచి అప్డేట్స్ కోరుతున్నారు.

గతేడాదే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సరిపెట్టుకోవాలంటూ ఇప్పటికీ మేకర్స్ స్పందించడం లేదు. సలార్ కంటే ముందే చిత్రాన్ని ప్రారంభించినా అభిమానులను పట్టించుకోండం లేదంటూ మండిపడుతున్నారు. మరోవైపు చిత్రం నుంచి ఏ చిన్న లీక్ లేకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తపడుతోంది. దీంతో ఏ మూల నుంచి కూడా ఎలాంటి సమాచారం రావడం లేదు. కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో  అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  #WakeupteamAdipurush అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఏదైనా ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలంటూ దర్శకుడు ఓం రౌత్ కు ట్యాగ్ చేస్తూ చేస్తున్నారు. 

అయితే, ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్టర్ ప్రభాస్ తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే 35 శాతం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది.  కాగా ‘ఆదిపురుష్’ కంటే ముందే Salaar అప్డేట్ రానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సలార్ మేకర్స్ అభిమానులకు పక్కా అప్డేట్ ఇచ్చేందుకు  ట్విటర్ హ్యాండిల్ ను  క్రియేట్ చేశారు. దీంతో ‘ఆదిపురుష్’ కంటే ముందే ‘సలార్’ నుంచి అప్డేట్ రానున్నదని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ రెండు చిత్రాల నుంచి తక్షణ అప్డేట్స్ కోరుకుంటున్నారు. 

రూ.500 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి  డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ (Kriti Sanon) సీత పాత్ర చేస్తున్నారు. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రోల్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.ప్రస్తుతం ఆదిపురుష్ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?