తొలిసారి విచిత్రమైన కాంబినేషన్.. శర్వానంద్ తో మాస్ డైరెక్టర్ మూవీ..

Published : Jun 01, 2024, 10:06 PM IST
తొలిసారి విచిత్రమైన కాంబినేషన్.. శర్వానంద్ తో మాస్ డైరెక్టర్ మూవీ..

సారాంశం

హీరో శర్వానంద్ పేరు చెప్పగానే యూత్ ఫుల్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ఆహ్లాదభరితంగా సాగే ప్రేమ కథలు గుర్తుకు వస్తాయి. శర్వానంద్ తన ఇమేజ్ కి భిన్నంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు.

హీరో శర్వానంద్ పేరు చెప్పగానే యూత్ ఫుల్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ఆహ్లాదభరితంగా సాగే ప్రేమ కథలు గుర్తుకు వస్తాయి. శర్వానంద్ తన ఇమేజ్ కి భిన్నంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఒకటి రెండు చిత్రాలు ఉన్నప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. 

ప్రస్తుతం శర్వానంద్ మనమే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా శర్వానంద్ తదుపరి చిత్రంపై క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఫక్తు మాస్ చిత్రాలు తెరకెక్కించే సంపత్ నందితో శర్వానంద్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి సంపత్ నంది.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ అనే చిత్రం తెరకెక్కించాలి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. వివిధ అడ్డంకుల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. దీనితో సంపత్ నంది మరో హీరో కోసం వెతుకుతుండగా శర్వానంద్ తో కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. 

ఇది విచిత్రమైన కాంబినేషన్ అనే చెప్పాలి. ఒక వైపు సాఫ్ట్ గా యూత్ ఫుల్ చిత్రాలు చేసే హీరో.. మరోవైపు పక్కా మాస్ చిత్రాలు చేసే డైరెక్టర్ కలవబోతున్నారు. దీనితో సంపత్ నంది ఎలాంటి కథ రెడీ చేశారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి