`గం గం గణేశా` కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చాయి?.. బిజినెస్‌ ఎంతంటే?

Published : Jun 01, 2024, 03:42 PM IST
`గం గం గణేశా` కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చాయి?.. బిజినెస్‌ ఎంతంటే?

సారాంశం

`బేబీ`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు ఆనంద్‌ దేవరకొండ.ఇప్పుడు జోనర్‌ మార్చి క్రైమ్‌ కామెడీ మూవీ చేశాడు. `గం గం గణేశా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే.   

`బేబీ` లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన మూవీ `గం గం గణేశా`. ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందింది. ఈ శుక్రవారం థియేటర్‌లోకి వచ్చింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కామెడీ కొంత వరకు నవ్వించిందనే, కానీ ఆశించిన స్థాయిలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదనే టాక్‌ వచ్చింది. వెన్నెల కిశోర్‌ పాత్ర సెకండాఫ్‌లో హైలైట్‌గా నిలిచింది. మొదటి రోజు డీసెంట్‌ ఆక్యుపెన్సీ ఉంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ డే కలెక్షన్లని ప్రకటించింది టీమ్‌. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.82కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఉన్నంతలో బెటర్‌గానే వచ్చిందని చెప్పొచ్చు. అయితే `బేబీ` సినిమాతో పోల్చితే చాలా డల్‌గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం సినిమాలపై జనంలో ఆసక్తి లేకపోవడం, పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాకపోవడంతో దీనికి ఓపెనింగ్స్ తగ్గాయి. అయితే ఈ వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటే మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పొచ్చు. 

ఇక `గం గం గణేశా` మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌ ప్రపంచ వ్యాప్తంగా 5.50కోట్లు అయ్యింది. ఓవర్సీస్‌లో కోటీ, తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్లు అయ్యింది. ఈ లెక్కన సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఆరు కోట్లు రావాలి. అంటే ఈ మూవీ 12కోట్ల గ్రాస్‌ వసూలు చేయాలి. ఓపెనింగ్ రోజు వచ్చినట్టుగానే వారం మొత్తం మెయింటేన్‌ అయితేనే అది సాధ్యం లేదంటే బయ్యర్లకి నష్టాలు తప్పవు. మరి ఆడియెన్స్ ఏం చేస్తారో చూడాలి. 

ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ప్రధానంగా `గం గం గణేశా`తోపాటు విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, అలాగే కార్తికేయ `భజే వాయు వేగం` చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో `భజే వాయు వేగం` మూవీకి మంచి రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు వచ్చాయి. సినిమా పరంగానూ పుంజుకుంటున్నట్టు తెలుస్తుంది. తొలి రోజు కంటే దీనికి థియేటర్‌ ఫుల్లింగ్‌ పెరిగిందట. విశ్వక్‌ సేన్‌ మూవీకి తగ్గిందని, ఆనంద్‌ మూవీ అంతే నడుస్తుందని టాక్‌. మరి ఈ మూడింటిలో ఏది విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి