
మే 31… సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ప్రతీ సంవత్సరం ఇదే రోజున మహేష్ బాబు సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ కచ్చితంగా ఉంటాయి. పోస్టరో, టీజరో, ట్రైలరో ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. ఇప్పుడు సెట్స్ మీదకు వచ్చే కొత్త సినిమా #SSMB29 కాబట్టి ఆ సినిమా అప్‌డేట్ రావాలి. అయితే అలాంటి అప్డేట్ ఏమీ రాజమౌళి నుంచి రాలేదు. దాంతో ఎంతగానో ఎక్సెపెక్ట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు. అయితే అందుకు కారణం మహేష్ లుక్ టెస్ట్ పూర్తి కాకపోవటేమే అంటున్నారు.
గత కొద్ది రోజులుగా మహేష్ బాబు లుక్ టెస్టులు జరుగుతున్నాయట. మొత్తంగా తొమ్మిది లుక్స్ సిద్ధం చేశారని, వాటిలో ఒకటి ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు. అయితే అందులో ఓ లుక్ విషయంలో రాజమౌళి బాగా ఇంట్రస్ట్ గా ఉన్నారట. అయితే దీని కోసం మహేష్ గెడ్డం, జుట్టు బాగా పెంచుకోవాల్సి ఉందట. అయితే ఇలాంటి లుక్‌లో మహేష్ ఇంతవరకు కనిపించలేదు. ఒకవేళ ఈ లుక్ ఓకే అనుకుంటే… అదే సూపర్ స్టార్ బర్త్ డే సర్‌ప్రైజ్ అవుతుంది అని ఆశించారు. కానీ రాజమౌళి మాత్రం ఫైనల్ చేయలేదట. అలాంటప్పుడు ఓ లుక్ ఏదో ఒకటి వదలేస్తే పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదని సైలెంట్ అయ్యారట. మహేష్ కూడా ఇందుకు ఓకే అన్నారట. ఏది చేసినా ఫెరఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట.
అలాగే ఫస్ట్ లుక్ ని వదలకపోవటానికి కారణం ఈ సినిమా ఇప్పుడిప్పుడే పూర్తి కాదు. ఇప్పుడు వరకు ఉన్న ప్లానింగ్ ప్రకారం అయితే 2026లో విడుదల అవుతుంది. అయితే రాజమౌళి సినిమాలు ముందు ప్లాన్ చేసిన టైమ్ కు రావడం చూడటం అరుదు. కాబట్టి ఇప్పటినుంచి పబ్లిసిటీ ఎందుకనేది కూడా ఓ కారణం అంటున్నారు.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మల్టిఫుల్ సెట్స్ హైదరాబాద్ లో వేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం క్రూ మొత్తాన్ని రాజమౌళి సెట్ చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో వేరే నిర్మాతలు కూడా ఇన్వాన్వ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందుకు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.