శర్వానంద్‌ బర్త్ డే ట్రీట్‌ కోసం కదిలొచ్చిన నాని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌.. `శ్రీకారం` ట్రైలర్‌..

Published : Mar 05, 2021, 07:14 PM IST
శర్వానంద్‌ బర్త్ డే ట్రీట్‌ కోసం కదిలొచ్చిన నాని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌.. `శ్రీకారం` ట్రైలర్‌..

సారాంశం

శర్వానంద్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. కిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ని యంగ్‌ హీరోస్‌ నాని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌ విడుదల చేశారు.

శర్వానంద్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. కిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ని యంగ్‌ హీరోస్‌ నాని, వరుణ్‌ తేజ్‌, నితిన్‌ విడుదల చేశారు. శర్వానంద్‌ కోసం ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం. రేపు(మార్చి 6) శర్వానంద్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేయడం విశేషం.

ట్రైలర్‌ విడుదల సందర్భంగా నాని చెబుతూ, `ఒక మంచి ఆలోచనతో, మంచి టీమ్‌ కలిసి రావడం మంచి ఫలితాన్నిస్తుంది. ముందుగా శర్వానంద్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని తెలిపారు. మరోవైపు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ట్రైలర్‌ ఉందని వరుణ్‌ తేజ్‌ తెలిపారు. అలాగే హిట్‌ కళ కనిపిస్తుందని నితిన్‌ చెప్పారు. 

హైయ్యర్‌ స్టడీస్‌ చేసిన శర్వానంద్‌ విదేశాల్లో కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేయాల్సింది పోయి, వ్యవసాయం చేస్తాననడం, టెక్నాలజీ వాడుకుని ఆయన వ్యవసాయం చేయడం, ఊరు ప్రజలను కదిలించి కలిసికట్టుగా వ్యవసాయం చేస్తే, మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం వంటి అంశాల ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్‌ బట్టి తెలుస్తుంది. ఇందులో శర్వా చుట్టూ హీరోయిన్‌ ప్రియాంక తిరగడం, అలాగే శర్వాకి, ఆయన తండ్రికి మధ్య ఎమోషన్స్, రిలేషన్స్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. 14రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?