అమ్మాయిలకు ఎదవలే నచ్చుతారట.. `చావు కబురు చల్లగా` ట్రైలర్‌

Published : Mar 05, 2021, 06:41 PM IST
అమ్మాయిలకు ఎదవలే నచ్చుతారట.. `చావు కబురు చల్లగా` ట్రైలర్‌

సారాంశం

`చావు కబురు చల్లగా` చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. శవాలను శ్మశాన వాటికకి తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్‌ భర్త చనిపోయిన అమ్మాయిని శ్మశాన వాటికలో చూసి ప్రేమించడమనే కథాంశంతో తిరిగే చిత్రమని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ హీరోగా `చావు కబురు చల్లగా` చిత్రం రూపొందుతుంది. కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. శవాలను శ్మశాన వాటికకి తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవర్‌ భర్త చనిపోయిన అమ్మాయిని శ్మశాన వాటికలో చూసి ప్రేమించడమనే కథాంశంతో తిరిగే చిత్రమని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 

కార్తీకేయ చనిపోయిన శవాలను అంతిమ యాత్రకి తీసుకెళ్లే బస్తీ బాలరాజుగా నటిస్తున్నారు. భర్త చనిపోయిన అమ్మాయిగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. `ఎవరు కావాలి మీకు` అంటే.. `ఎవరొచ్చినా ఫర్వాలేదు అంతిమయాత్రకి పట్టుకెళ్లిపోతాను..` అని కార్తికేయ చెప్పడం, `మా అబ్బాయిగారి ఫ్రెండా?` అంటే `మీ అమ్మాయిగారీ బాయ్‌ఫ్రెండ్‌` అని చెప్పడం, `నువ్వు నెంబర్‌ 1 వెదవవి` అని లావణ్య త్రిపాఠి అంటే `అమ్మాయిలకు ఎట్టాగూ ఎదవలే నచ్చుతారటగా..`, `ఓయ్‌ పిల్లా నువ్వు నాకు ఫిక్స్ అయిపో..`, `శ్మశానంలో మీ ఆయన పక్కన ఇచ్చే చోటేదో నీ మనసులో ఇవ్వొచ్చుగా`, `ఎక్కువ చేస్తే నీకు ఒరిజినల్‌ పడిపోతుంది` అంటూ కార్తికేయ చెప్పే డైలాగులతో కూడిన ట్రైలర్‌ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?