బజ్ లేదు.. శర్వానంద్ నెక్స్ట్ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ?

pratap reddy   | Asianet News
Published : Nov 19, 2021, 09:31 AM IST
బజ్ లేదు.. శర్వానంద్ నెక్స్ట్ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ?

సారాంశం

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'మహా సముద్రం' చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం Sharwanand 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'Oke Oka Jeevitham' అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

యంగ్ హీరో శర్వానంద్ తన నటనతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. శర్వానంద్ కోసం థియేటర్ కు వెళ్లి సినిమా చూసే యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల శర్వానంద్ కెరీర్ లో డల్ ఫేజ్ కొనసాగుతోంది. మహానుభావుడు చిత్రం తర్వాత శర్వానంద్ కు సాలిడ్ హిట్ అంటూ లేదు. 

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'మహా సముద్రం' చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం Sharwanand 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'Oke Oka Jeevitham' అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకే ఒక జీవితం చిత్రం తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. 

అయితే ఈ చిత్రంపై ఇంతవరకు ఎలాంటి బజ్ ఏర్పడలేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం పట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆసక్తికర అంశాలతో ప్రచారం చేసి బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. దీనితో ఈ చిత్రాన్ని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని టాక్. దీనితో నిర్మాణ సంస్థ 'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 

Also Read: Anasuya Hot Pics: చీర కొంగు జారిపోతుండగా అనసూయ హాట్‌ పోజులు.. డార్క్ చాక్లెట్‌లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మంచి ఆఫర్ దక్కితే ఓటిటిలో ఈ మూవీ విడుదల కానుంది. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఇదిలా ఉండగా శర్వానంద్ నటిస్తున్న మరో చిత్రం ' ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంపై మంచి బజ్ ఉంది. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తోంది. శర్వానంద్ కు వరుసగా రణరంగం, జాను, శ్రీకారం లాంటి పరాజయాలు ఎదురయ్యాయి. 

Also Read: హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..