కిడ్నాప్ కి గురైన రామ్ గోపాల్ వర్మ... పవన్ ఫ్యాన్స్ పై అనుమానం

By team teluguFirst Published Nov 19, 2021, 9:04 AM IST
Highlights

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) కిడ్నాప్ అయ్యాడు. ఆయన కిడ్నాప్ వెనుక మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తో పాటు మాజీ సీఎం కొడుకు హస్తం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ సంచలనంగా మారింది. 
 

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గెలకని వారంటూ ఎవరూ లేరు. సినీ ప్రముఖుల నుండి రాజకీయన నాయకుల వరకు... లోకల్ నుండి ఇంటర్నేషనల్ వరకూ ఆయన ఎవరినీ వదలరు. అమెరికా అధ్యక్షుడిపై కూడా తన మార్కు సెటైర్స్ వేస్తాడు. అయితే తరచుగా పవన్ కళ్యాణ్ (Pawan kalyan), నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరిని బద్నాం చేస్తూ.. వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. 

Also read Pawan Kalyan: `భీమ్లా నాయక్‌` మాస్టర్‌ ప్లాన్‌ మైండ్‌ బ్లాంక్‌.. ఈ సంక్రాంతికి దేత్తడే.. అసలు గేమ్‌ స్టార్ట్
ముఖ్యంగా పవన్ రాజకీయ వైఫల్యాలను ఉద్దేశిస్తూ  స్పూఫ్ గా  తెరకెక్కిన పవర్ స్టార్ (Power star) మూవీ పవన్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. ఈ మూవీ విడుదల అడ్డుకోవాలని ఫ్యాన్స్ శతవిధాలా ప్రయత్నం చేశారు.పవన్ ఫ్యాన్స్ వర్మ ఆఫీస్ పై దాడి చేసి, ఆయనను కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అనుకున్నది సాధించే వరకు మొండిగా ముందుకు వెళ్లే వర్మ... డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో పవర్ స్టార్ మూవీ విడుదల చేశారు. ఈ మూవీలో పవన్ పై తీవ్ర స్థాయిలో సెటైర్స్ వేసిన వర్మ, క్లైమాక్స్ లో పవన్ ఫ్యాన్స్ శాంతించేలా... సీన్స్ రూపొందించారు. 

Also read Renu Desai: రేణు దేశాయ్ ఆరోగ్యంపై రూమర్స్.. ఇదిగో క్లారిటీ
ఈ సినిమా విడుదలైన ఏడాది దాటిపోగా.. ఈ మధ్య కాలంలో పవన్ జోలికి వర్మ పోలేదు. తాజాగా వర్మ మరో మూవీ ప్రకటించారు. పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదల చేస్తున్నారు. అయితే ఆర్జీవీ కిడ్నాప్ వెనుక... మెగా, పవన్ ఫ్యాన్స్ తో పాటు మాజీ సీఎం కొడుకు(నారా లోకేష్) హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నాం... అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. 


గత అనుభవాల నేపథ్యంలో ఆర్జీవీ మరలా ఈ సినిమా ద్వారా పవన్ ఫ్యాన్స్ ని గెలికే పనికి పూనుకున్నాడని అందరూ భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆర్జీవీ కిడ్నాప్ ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కలదు. భీమవరం టాకీస్ బ్యానర్ లో కేవీ ఛటర్జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... అధిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీతో వర్మ ఎంత రాద్ధాంతం చేయనున్నాడో... 

 

Hey POWER STAR …RGV MISSING trailer is releasing at 9.30 am tmrw 19th ..A director called Ram Gopal Varma gets kidnapped and members from an oMEGA FAMILY and an EX CM and his SON are SUSPECTED..Film stars @chirudoesnttweet @ and pic.twitter.com/7EVHhmmbA6

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!