దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

By Surya PrakashFirst Published Jul 6, 2024, 9:54 AM IST
Highlights

రీసెంట్ గా కల్కిలో గెస్ట్ రోల్ లో కనిపించిన దుల్కర్ ...ఇప్పుడు మరో తెలుగు సినిమా కమిటయ్యారని వినికిడి.  వైజయంతి సంస్థ నిర్మించబోయే సినిమాకు ...


దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో  తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. 

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా కల్కిలో గెస్ట్ రోల్ లో కనిపించిన దుల్కర్ ...ఇప్పుడు మరో తెలుగు సినిమా కమిటయ్యారని వినికిడి.  వైజయంతి సంస్థ నిర్మించబోయే సినిమాకు పవన్ సాధినేని దర్శకుడిగా ఓకే అయినట్టు వినికిడి. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయ్యినట్లే అంటున్నారు. ఇదే బ్యానర్ లో గతంలో మహానటి,  తర్వాత సీతా రామమ్ చేసారు. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. 

Latest Videos

దర్శకుడు పవన్ సాధినేని గురించి చెప్పాలంటే టెక్నికల్ గా మంచి స్ట్రాండర్డ్స్ ఉన్న వ్యక్తిగా చెప్తారు.   'ప్రేమ ఇష్క్ కాదల్' తో పరిశ్రమలోకి దర్శకుడిగా ఆరంగేట్రం చేసి, మొదటి సినిమాతో ప్రసంశలు అందుకోవటమే కాకుండా, అందరి కళ్ళలో పడ్డాడు పవన్. ఆ తరువాత 'సావిత్రి' చేసారు. కంటిన్యూగా గత కొంతకాలంగా వెబ్ సీరిస్ లు చేస్తూ...రాజేంద్రప్రసాద్ తో చేసిన  సేనాపతి ద్వారా అందరిని ఒక్కసారి ఎలర్ట్ చేసారు. ఆ తర్వాత చేసిన  'దయా' అనే వెబ్ సిరీస్ కూడా సెన్సేషన్ అయ్యింది.   

ఇక ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.  ఇందులో జెడి చక్రవర్తి కీలకమైన పాత్ర చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా  పూర్తి కావచ్చు అని, ఈ సినిమా బయిటకు వస్తే తెలుగులో లోకేష్ కనకరాజ్ అనే స్దాయిలో ఫిల్మ్ వచ్చిందని ఇన్ సైడ్ వర్గాల నుంచి తెలుస్తోంది. దుల్కర్ తో సినిమా అనేది మొదలైతే పవన్ సాదినేని నెక్ట్స్ లెవిల్ కు వెళ్లినట్లే. పెద్ద బ్యానర్స్, పెద్ద హీరోలతో ఆయన సినిమా లు చేయగలుగుతారు. 

click me!