నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు,అసలేం జరిగింది?

By Surya Prakash  |  First Published May 29, 2021, 10:27 AM IST

మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలు ఆయన ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని ఆపినట్లు సమాచారం. ఈ మేరకు శర్వానంద్ నిర్మాణ సంస్దకు నోటీసులు పంపారని వినపడుతోంది.


హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్  హీరో శర్వానంద్. అయితే ఆయనకు ఈ మధ్య కాలంలో హిట్ అనేది దక్కటం లేదు. రీసెంట్ గా శర్వానంద్ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు బి కిషోర్ అనే దర్శకుడు కొత్తగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ అలాగే ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించారు. ఈ సినిమా 14 రీల్స్ సంస్థ నిర్మించింది. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలు ఆయన ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని ఆపినట్లు సమాచారం. ఈ మేరకు శర్వానంద్ నిర్మాణ సంస్దకు నోటీసులు పంపారని వినపడుతోంది.

అందుతున్న సమాచారం మేరుక...  “శ్రీకారం”  చిత్రానికి గానూ ముందుగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తో 50% లాభం తీసుకునేట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట శర్వా. అయితే సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన రెండు కోట్ల రూపాయలకు పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇచ్చారట. అయితే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయట. దీంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. మరి ఈ వివాదాన్ని “శ్రీకారం” నిర్మాతలు, శర్వాతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకుంటారా ? లేదంటే లీగల్ గానే ముందుకు వెళ్తారా అనేది చూడాలి. 

Latest Videos

ఇక శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'మహాసముద్రం'. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి.  సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం.మొదటి సినిమా RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ప్రతి సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ సర్వ హంగులతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
 

click me!