ముంబయిలో ఖరీదైన డ్యూప్లెక్స్ హౌజ్‌ని కొనుగోలు చేసిన అమితాబ్‌..విలువెంతంటే?

Published : May 29, 2021, 07:45 AM IST
ముంబయిలో ఖరీదైన డ్యూప్లెక్స్ హౌజ్‌ని కొనుగోలు చేసిన అమితాబ్‌..విలువెంతంటే?

సారాంశం

అమితాబ్‌ బచ్చన్‌ ముంబయిలో ఓ భారీ ఇంటిని కొనుగోలు చేశారు.  ఖరీదైన డ్యూప్లెక్స్  హౌస్‌ని కొనుగోలు చేసినట్టుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. 

అమితాబ్‌ బచ్చన్‌ ముంబయిలో ఓ భారీ ఇంటిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర, ముంబయిలో ఇప్పటికే బిగ్‌బాస్‌కి చాలా ఇళ్లు, భవనాలున్నాయి. `జల్సా నుంచి ప్రతీక్ష` వరకు విలాసవంతమైన హౌజ్‌లున్నాయి. తాజాగా ఆయన మరో ఖరీదైన డ్యూప్లెక్స్  హౌస్‌ని కొనుగోలు చేసినట్టుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. 

కొత్త ఇళ్లు వైశాల్యం 5184చదరపు అడుగులు అని, దీని విలువ 31కోట్లు అని వినిపిస్తుంది. ముంబయిలోని అంథేరీ సబర్బన్‌లో కొత్త నిర్మాణం చేపడుతున్న అట్లాంటిస్‌ ప్రాజెక్ట్ లో ఈ కొత్త ఇళ్లు ఉంటుందని సమాచారం. గతేడాది డిసెంబర్‌లో ఈ కొనుగోలు ప్రాసెస్‌ జరిగిందని, ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ హౌస్ నిమిత్తం అమితాబ్ రూ. 62 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించారట. ఆరు కార్ల పార్కింగ్‌తో పాటు అనేక సదుపాయాలు ఈ ఇంటికి ఉన్నట్లుగా టాక్. 

ప్రస్తుతం ముంబైలోని జుహు ఏరియాలో ఉన్న ఇంటిలో అమితాబ్ నివసిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడుంటే ఇంటిని కూడా ఆయన ఓ ఫిల్మ్ మేకర్ నుంచి కొనుగోలు చేసి.. మళ్లీ అన్ని సౌకర్యాలతో పునర్నిర్మించారు.ఇందులో అమితాబ్‌, భార్య జయ, తనయుడు హీరో అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌ కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడే బాలీవుడ్‌ ప్రముఖులు సన్నీ డియోల్‌, దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కూడా ఫ్లాట్లు కొనుగోలు చేశారని సమాచారం. 

ఇక ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ `చెహ్ర్‌`, `జుండ్‌`, `బ్రహ్మాస్త్ర`, `బట్టర్‌ఫ్లై`, `మేడే`, `గుడ్‌బై` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే