సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అందరికి అవసరమేః `ఏక్‌మినీ కథ` హీరో సంతోష్‌ శోభన్‌

Published : May 29, 2021, 08:56 AM IST
సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అందరికి అవసరమేః `ఏక్‌మినీ కథ` హీరో సంతోష్‌ శోభన్‌

సారాంశం

హీరో సంతోష్‌ శోభన్‌ నటించిన చిత్రం `ఏక్‌ మినీ కథ`. ప్రభాస్‌, రామ్‌చరణ్‌ బెస్ట్‌ విషెస్‌ అందుకుని అమెజాన్‌ ప్రైమ్‌లో గురువారం విడుదలైందీ సినిమా. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సంతోష్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. 

`దేశంలో అన్ని వయసుల వారికి సెక్స్ ఎడ్యుకేషన్‌ చాలా అవసరం. `ఏక్‌ మినీ కథ` ద్వారా ఆ విషయాన్ని నవ్వుస్తూ, చాలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పామని భావిస్తున్నాం` అని అన్నారు హీరో సంతోష్‌ శోభన్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `ఏక్‌ మినీ కథ`. కార్తీక్‌ దర్శకుడు. మేర్లపాక గాంధీ కథ అందివ్వగా, యూవీ క్రియేషన్స్ సంస్థనిర్మించింది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌ బెస్ట్‌ విషెస్‌ అందుకుని అమెజాన్‌ ప్రైమ్‌లో గురువారం విడుదలైందీ సినిమా. 

తాజాగా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో హీరో సంతోష్‌ శోభన్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. `ఫస్ట్ టైమ్‌ నా సినిమాకి ఇంతగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. వందశాతం మనస్ఫూర్తిగా నవ్వుకున్నామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అంతకు మించిన ప్రశంస లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల్ని నవ్వించగలడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. ఇలాంటి కథతో సినిమా చేయడం ఎప్పుడూ రిస్క్ అనుకోలేదు. చాలా క్లీన్‌గా, ఎటువంటి వల్గారిటీ లేకుండా మేర్లపాక గాంధీ ఈ కథ రాశారు. నిర్మాతలు, దర్శకుడు, నేను కథని నమ్మి చేశాం. సెక్స్ ఎడ్యుకేషన్‌ని  హెల్దీగా చెప్పాలనుకున్నాం. అలాగే, చెప్పాం.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లో సినిమాని చూసే పరిస్థితి లేదు. దీంతో సినిమానే వాళ్ల దగ్గరకు తీసుకువెళ్లాం. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఫుడ్‌ లేదు. ఇళ్లు లేవు. ఇప్పుడీ మూడు ఉంటే అదృష్టవంతులం. ఇలాంటి టైమ్‌లో సినిమా చేసి, విడుదల చేసే అవకాశం వచ్చింది. అందుకు నేను లక్కీగా భావిస్తున్నా. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్‌తో ఒకటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌లో మరో సినిమా చేయాలి. నా స్నేహితుడు అభిషేక్‌ మహర్షి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించా` అని తెలిపాడు. 

ప్రభాస్‌, రామ్‌చరణ్‌ల గురించి మాట్లాడుతూ, `రామ్‌చరణ్‌ వండర్‌ఫుల్‌ పర్సన్‌. అద్భుతమైన నటుడు.. ఆయన మా సినిమా గురించి పోస్ట్‌ చేయడం హ్యాపీ గా ఉంది. ప్రభాస్‌ అన్నయ్యకు నేను ఫ్యాన్‌ని. ఆయన సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అప్‌డేట్స్‌ ఎప్పుడొస్తాయని ఎదురుచూసే నాకు, నా సినిమా ట్రైలర్‌ ప్రభాస్‌ అన్నయ్య విడుదల చేయడం, పోస్ట్‌ చేయడం కంటే ఏం కావాలి? ఓ అభిమానిగా ఇంకేం అడగగలను? అందుకు చాలా ఆనందంగా ఉంది` అని తెలిపారు.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు