త్రివిక్రమ్ డైరెక్షన్ లో శర్వానంద్!

Published : Aug 05, 2019, 12:38 PM IST
త్రివిక్రమ్ డైరెక్షన్ లో శర్వానంద్!

సారాంశం

నితిన్ తో అఆ సినిమా చేసిన తరువాత అలాంటి మీడియం హీరోలతో కూడా మాటల మాంత్రికుడు సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే గతంలో త్రివిక్రమ్ ఇచ్చిన మాటను ఇటీవల శర్వా గుర్తు చేసుకున్నాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన రణరంగం నిర్వహించిన ఈవెంట్ కి త్రివిక్రమ్ ముఖ్య అతిదిగా వచ్చిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ తో వర్క్ చేయాలనీ ప్రతి ఒక్క నటుడు ఆశపడతారు. కథ సెట్టయితే ఏ మాత్రం ఆలోచించకుండా తనకు నచ్చిన హీరోల దగ్గరకు వెళ్లి స్క్రిప్ట్ ఒకే చేయించగల దర్శకుడు త్రివిక్రమ్. అయితే నితిన్ తో అఆ సినిమా చేసిన తరువాత అలాంటి మీడియం హీరోలతో కూడా మాటల మాంత్రికుడు సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. 

అయితే గతంలో త్రివిక్రమ్ ఇచ్చిన మాటను ఇటీవల శర్వా గుర్తు చేసుకున్నాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన రణరంగం నిర్వహించిన ఈవెంట్ కి త్రివిక్రమ్ ముఖ్య అతిదిగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో శర్వా త్రివిక్రమ్ పై ఉన్న అభిమానాన్ని తన మాటలతో వివరించాడు. 

గతంలో ఆయన నాతో సినిమా చేస్తారని ప్రామిస్ చేసారని ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. త్రివిక్రమ్ తన స్మైల్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరోసారి శర్వాకి అర్థమైంది, మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ఇక రణరంగం సినిమా ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే