పగబట్టిన పాముని చంపడమే మార్గం.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న `మహాసముద్రం` ట్రైలర్‌

Published : Sep 23, 2021, 06:38 PM IST
పగబట్టిన పాముని చంపడమే మార్గం.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న `మహాసముద్రం` ట్రైలర్‌

సారాంశం

శర్వానంద్‌(sharwanand), సిద్ధార్థ్‌ (siddharth) హీరోలుగా నటిస్తున్న చిత్రం `మహాసముద్రం`(mahasamudram trailer). ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. యాక్షన్‌, రొమాన్స్, లవ్‌, రివేంజ్‌ మేళవింపుగా ట్రైలర్‌ సాగుతూ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.

శర్వానంద్‌(sharwanand), సిద్ధార్థ్‌(siddharth), అను ఇమ్మాన్యుయెల్‌, అదితి రావు హైదరీ కలిసి నటిస్తున్న చిత్రం `మహాసముద్రం`(mahasamudram). `ఆర్ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర(అనిల్‌ సుంకర) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. యాక్షన్‌, రొమాన్స్, లవ్‌, ప్రతీకారం మేళవింపుగా సాగే ఈ ట్రైలర్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. అజయ్‌ భూపతి నుంచి మరో బ్లాక్‌ బస్టర్‌ ఖాయమనే సందేశాన్నిస్తుంది. 

ట్రైలర్‌లో శర్వానంద్‌, అను ఇమ్మాన్యుయెల్‌ జోడీగా కనిపిస్తున్నారు. సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ మరో జోడిగా నటిస్తున్నారు. శర్వానంద్‌ డైలాగ్‌లో ట్రైలర్‌ ప్రారంభమైంది. `సముద్రం చాలా గొప్పది మామ.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుందని`, `ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకాలు మనకూడా(ఫేవర్‌గా) రాసి ఉండాలి` అని చెప్పడం సినిమా కథలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. మరోవైపు `పగబట్టిన పాముని చంపడం ఒక్కటే మార్గమని` జగపతిబాబు కోపంతో చెప్పడం, `మీరు చేస్తే నీతి, నేను చేస్తే బూతా.. `అని సిద్ధార్థ్‌ చెప్పడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

మరోవైపు `నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన బాగున్నట్టు కాదు అర్జున్.. నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్‌.. నీలో కలవాలని అన్ని రాత్రులు కోరుకుంటాయి` అని అను ఇమ్మాన్యుయెల్‌ చెప్పడం, చివరగా సిద్ధార్థ్‌.. అదితిపై గన్‌ ఎక్కుపెట్టడం మరింత ఆసక్తిని రెకేత్తిస్తుంది. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ సైతం నటిస్తుండటం మరో విశేషంగా చెప్పొచ్చు. మొత్తంగా `మహాసముద్రం` ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి