సీన్ లోకి సమంత.. దిల్ రాజుకు రిలీఫ్ కొండంత

Published : Dec 14, 2018, 07:40 AM IST
సీన్ లోకి సమంత.. దిల్ రాజుకు రిలీఫ్ కొండంత

సారాంశం

గత కొంతకాలంగా దిల్ రాజు చాలా టెన్షన్ లో ఉన్నారు. తను ఎంతో మోజుపడి కొన్న 96 రీమేక్ చిత్రానికి హీరో,హీరోయిన్స్ దొరక్కపోవటం ఆయన్ని ఇబ్బందిపెడతోంది. నాని, అల్లు అర్జున్ ,గోపీచంద్ ఇలా వరసపెట్టి చిన్నా,పెద్దా హీరోలంతా ఆ పాత్రను చేయలేమంటూ చేతులు ఎత్తేసారు. 

తమిళంలో రిలీజ్ కు ముందే రీమేక్ రైట్స్ తీసుకుని తప్పు చేసాడని చాలా మంది అన్నారు. రీమేక్ ఎందుకు డబ్బింగ్ చేయమంటూ సలహాలు ఇచ్చారు. అయితే దిల్ రాజు పట్టువదలని విక్రమార్కుడు. చివరకు తన ప్రాజెక్టుకి హీరోని ఒప్పించాడు. అతనే శర్వానంద్.

శర్వానంద్ గతంలో తమ బ్యానర్ లో శతమానం భవతి వంటి హిట్ సినిమాలో చేసారు. అతను అడిగితే ఒప్పుకోవచ్చు కానీ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ కొంచెం అటూ ఇటూలో ఇలాంటి సబ్జెక్టే చేసాడు. మరి ఒప్పించటం ఎలా...సమంత హీరోయిన్ గా ఈ ప్రాజెక్టులోకి తెస్తే పని సులభమవుతుందనిపించింది. మొదట సమంత ని సీన్ లోకి తెచ్చారు. ఇప్పుడు శర్వానంద్ దగ్గర ప్రపోజల్ పెట్టారు. 

సమంత హీరోయిన్ గా చేస్తున్న ప్రాజెక్టు అనగానే శర్వానంద్ వెంటనే మారు మాట్లాడకుండా యస్ చెప్పేసారు. అలా దిల్ రాజు తన పని చేసుకున్నారు. తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

PREV
click me!

Recommended Stories

అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..