కేసీఆర్ ఇలియానా కంటే బావుంటారు.. బయోపిక్ తీస్తా: వర్మ

Published : Dec 13, 2018, 09:24 PM IST
కేసీఆర్ ఇలియానా కంటే బావుంటారు.. బయోపిక్ తీస్తా: వర్మ

సారాంశం

వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వర్మ తన సినిమా గురించే కాకుండా రాజకీయాల గురించి కూడా తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా కేసీఆర్ బయోపిక్ అంటూ సరికొత్త టాపిక్ ను లేవనెత్తారు. 

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైనల్ గా తన సారథ్యంలో భైరవగీత సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సినిమా రిలీజ్ కానున్న సందర్బంగా వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వర్మ తన సినిమా గురించే కాకుండా రాజకీయాల గురించి కూడా తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా కేసీఆర్ బయోపిక్ అంటూ సరికొత్త టాపిక్ ను లేవనెత్తారు. 

మొదటి ఎలక్షన్స్ కంటే రెండవసారి ఎక్కువ స్థాయిలో గెలవడం ఎవరికీ సాధ్యం కానిది. కేసీఆర్ ఆ స్థాయిలో గెలుస్తారని నేను అసలు ఉహించనే లేదు. ఆయన ఇలియానా కంటే అందంగా ఉంటారు. అందమంటే లుక్స్ గురించి కాదు.. ఆకర్షించే గుణం గురించి నేను మాట్లాడుతున్నా. కేసీఆర్ మాట్లాడుతుంటే ఎంత సేపైనా చూడాలనిపిస్తుంది. 

అదే ఇలియానా డ్యాన్స్ 3 నిమిషాలకంటే కంటే ఎక్కువసేపు చూడలేము. పంచ్ డైలాగులు ఎన్నో పేలుస్తారు. హీరోల కంటే ఆయన ఛరిష్మా గొప్పది అంటూ.. కుదిరితే కేసీఆర్ బయోపిక్ తీస్తాను అని వివరణ ఇచ్చారు. అయితే వర్మ మాట మీద నిలబడటం నమ్మలేమని ఒకవేళ వర్మ స్టైల్ లో కేసీఆర్ బయోపిక్ వస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి