మళ్ళీ 40+ లో శర్వా.. దిల్ రాజు హ్యాపీ!

Published : Dec 21, 2018, 02:58 PM ISTUpdated : Dec 21, 2018, 03:01 PM IST
మళ్ళీ 40+ లో శర్వా.. దిల్ రాజు హ్యాపీ!

సారాంశం

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ఆ సినిమాలో యువకుడిగానే కాకుండా వయసు పై బడిన వ్యక్తిగాను నటించాడు. ఆ పాత్ర క్లిక్ అయ్యింది. ఇకపోతే నెక్స్ట్ ఈ కుర్ర హీరో మరోసారి అదే తరహాలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ఆ సినిమాలో యువకుడిగానే కాకుండా వయసు పై బడిన వ్యక్తిగాను నటించాడు. ఆ పాత్ర క్లిక్ అయ్యింది. ఇకపోతే నెక్స్ట్ ఈ కుర్ర హీరో మరోసారి అదే తరహాలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు గత కొంత కాలంగా 96 అనే తమిళ కథను తెలుగులో నిర్మించాలని విశ్వా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే కొన్ని రోజుల క్రితం నాని - అల్లు అర్జున్ వంటి హీరోలకు స్పెషల్ వేసి మరి దిల్ రాజు 96 ను చూపించాడు. ఆఖరికి గోపీచంద్ తో కూడా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ఎవరు రిస్క్ చేయాలనీ అనుకోలేదు. ఫైనల్ గా శర్వానంద్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పేశాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ ఎనౌన్స్ మెంట్  ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వా క్లారిటీ ఇచ్చాడు. 

తమిళ 96 కథను తెరకెక్కించిన ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడు. శర్వా ఇదివరకు వయసు పై బడిన వ్యక్తిగా మెప్పించాడు కాబట్టి మరోసారి ఆకట్టుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శర్వా నటించిన పడి పడి లేచే మనసు నేడు విడుదలైంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు