పొట్టి షారుక్ తో హాట్ కత్రినా!

Published : Nov 01, 2018, 04:48 PM IST
పొట్టి షారుక్ తో హాట్ కత్రినా!

సారాంశం

బాలీవుడ్ లో గత కొంత కాలంగా ఖాన్ త్రయం రేంజ్ బాగా పెరిగింది. అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ వారి సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ స్థాయిని పెంచుతున్నారు. అయితే ఈ రేస్ లోచాలా కాలం నుంచి షారుక్ వెనుకబడ్డాడు. 

ఇక ఇప్పుడు ఒక సరికొత్త ప్రయోగంతో కింగ్ ఖాన్ ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు సిద్దమవుతున్నాడు. మరగుజ్జు పాత్రలో జీరో అనే సినిమాలో షారుక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాకు సంబందించిన రెండు పోస్టర్స్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

పొట్టిగా కనిపిస్తున్న షారుక్ హాట్ గా కనిపిస్తోన్న కత్రినా కైఫ్ తో రొమాంటిక్ గా స్టిల్ ఇచ్చాడు. మరో పోస్టర్ లో అనుష్క శర్మతో సింపుల్ గా కనిపించి పొట్టి షారుక్ పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!