సాయి పల్లవితో రానా ప్రేమాయణం!

Published : Nov 01, 2018, 04:27 PM IST
సాయి పల్లవితో రానా ప్రేమాయణం!

సారాంశం

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటాడు. సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటాడు. సోలో హీరోగా కూడా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు ఓ విభిన్నమైన ప్రేమకథలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 'నీది నాది ఒకే కథ' సినిమా ఫేం దర్శకుడు వేణు ఊడుగుల చెప్పిన కథ విన్న రానా ఇంప్రెస్ అయి సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేసుకున్న తరువాత హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడట దర్శకుడు. తెరపై రానా, సాయి పల్లవిల జంటగా ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుందని భావిస్తున్నాడు.

పీరియాడిక్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. 'పడి పడి లేచే మనసు' సినిమాను  నిర్మిస్తోన్న సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్
Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?