షారుక్ ని చావు దెబ్బ కొట్టిన జీరో!

Published : Dec 23, 2018, 03:58 PM IST
షారుక్ ని చావు దెబ్బ కొట్టిన జీరో!

సారాంశం

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లతో మొన్నటి వరకు సమానంగా మార్కెట్ సెట్ చేసుకుంటూ వచ్చిన షారుక్ ఖాన్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయ్యాడు. 

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లతో మొన్నటి వరకు సమానంగా మార్కెట్ సెట్ చేసుకుంటూ వచ్చిన షారుక్ ఖాన్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయ్యాడు. గత ఏడాది వారికీ చేసిన ప్రతి సినిమా దెబ్బేస్తూ వస్తోంది. రీసెంట్ గా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన జీరో సినిమా కూడా ఆడియెన్స్ ని నిరాశపరిచింది.

జీరో కు నెగిటివ్ టాక్ రావడంతో షారుక్ కి చావుదెబ్బ అంటూ బాలీవుడ్ లో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. శుక్రవారం విడుదలైన జీరో మొదటి రోజు 20 కోట్లను వసూలు చేయగా శనివారంకు డౌన్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చెందుతున్నారు. రెండవ రోజు జీరో 18 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే అందుకుంది. వీకెండ్ లో సాధారణంగా కలెక్షన్స్ పెరుగుతాయి అనుకోని భారీగా రిలీజ్ చేసిన బయ్యర్లు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు.

వీకెండ్ తరువాత పరిస్థితి ఏమిటనేది సందేహంగా మారింది. సినిమాకు రివ్యూల దెబ్బ కూడా బాగానే పడింది. ఏ మాత్రం పాజిటివ్ రివ్యూస్ రాలేదు. షారుక్ జీరో సినిమాలో తన స్టార్ డమ్ ని పక్కనపెట్టి మరి మరగుజ్జు పాత్రలో నటించాడు. హీరోయిన్స్ గ్లామర్ సినిమాకు పెద్దగా ఉపయోగపడేలా కనిపించడం లేదు. మరి మొత్తంగా షారుక్ ఎంతవరకు సేఫ్ జోన్ లో పడతాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

'తెలుగులో అతడే నా ఫేవరెట్.. ఆ సినిమాతో పిచ్చపిచ్చగా నచ్చాడు..' రాజాసాబ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్
Poonam Kaur: ఆ నటుడుకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే న్యూడ్‌ వీడియోలు రిలీజ్‌ చేస్తామన్నారు.. నటి ఆవేదన