రజనీ ఇలా ట్విస్ట్ ఇస్తాడనుకోలేదంటూ ఫ్యాన్స్

Published : Dec 23, 2018, 03:55 PM IST
రజనీ ఇలా ట్విస్ట్ ఇస్తాడనుకోలేదంటూ ఫ్యాన్స్

సారాంశం

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చారు. గతేడాది డిసెంబరు 31న రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్‌... నేటికీ పార్టీ ప్రారంభంపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల ఆయన పుట్టిరోజున ఏదైనా ప్రకటన వెలువడుతుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. 

దాంతో రాబోయే 31న అలాంటి ప్రకటనతో మరోసారి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారని ఆశించారు. అందుకోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  అయితే ఆయన చక్కగా ఫ్యామిలీని తీసుకుని అమెరికా చెక్కేస్తున్నారు. దాంతో ఈ ఊహించని పరిణామానికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.  

కొత్త సంవత్సర వేడుకల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఉత్సవాలు చేసుకోనున్నారు. ఈ ఆశ కూడా నెరవేరేలా లేదు. శనివారం రాత్రి రజనీకాంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా బయలుదేరారు. జనవరి మొదటి వారం వరకు అక్కడే ఉంటారని సమాచారం. 

క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సర వేడుకలను అక్కడే చేసుకోనున్నట్లు తెలిసింది. తిరిగొచ్చిన తర్వాత సంక్రాంతికి విడుదల కానున్న ‘పేట’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..
టాక్సిక్ లో బోల్డ్ సీన్, ఈ సినిమాకి ఆమె దర్శకురాలు అంటే నమ్మలేకపోతున్నా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్