ఈ సారి సక్సెస్ రాకపోతే నిజంగానే జీరో!

Published : Dec 14, 2018, 04:14 PM IST
ఈ సారి సక్సెస్ రాకపోతే నిజంగానే జీరో!

సారాంశం

  బాలీవుడ్ లో మొన్నటి వరకు ఖాన్ త్రయం హవా బాగా నడిచేది.అమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ అలాగే షారుక్ ఖాన్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను పోటాపోటీగా తిరగరాయడంలో సిద్దహస్తులు. అయితే సల్మాన్ - అమిర్ ప్రతీ ఏడాది బాక్స్ ఆఫీస్ రేంజ్ ను పెంచుకుంటూ వెళుతుంటే షారుక్ మాత్రం తగ్గుతూ వస్తున్నాడు. 

షారుక్ హిట్టందుకొని చాలా కాలమవుతోంది. చివరగా షారుక్ నుంచి వచ్చిన 'జబ్ హ్యారీ మెట్ సెజాల్' డిజాస్టర్ గా నిలిచింది. నిన్నా మొన్న వచ్చిన చిన్న హీరోలు మినిమమ్ 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే షారుక్ మాత్రం తగ్గుతూ వస్తున్నాడు. ఇక ఈ సారి ఎలాగైనా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని మినిమమ్ 400 కోట్ల గ్రాస్ ను క్రాస్ చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. 

షారుక్ మొదటిసారి ఒక మరగుజ్జు పాత్రలో నటించిన జీరో సినిమా ఈ క్రిస్మస్ వీక్ లో సందడి చేయనుంది. సినిమాపై ఓ వర్గం వారిలో అంచనాలు భారీగా ఉన్నాయి తప్పకుండా సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళి తన మార్కెట్ రేట్ పెంచాలని కింగ్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అనుష్క శర్మ - కత్రినా కైఫ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు.

PREV
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి