బెల్లంకొండ డిస్ట్రిబ్యూటర్ ని కొట్టాడా..?

Published : Dec 14, 2018, 01:57 PM IST
బెల్లంకొండ డిస్ట్రిబ్యూటర్ ని కొట్టాడా..?

సారాంశం

డబ్బు వ్యవహారాల్లో గొడవలు రావడం కామన్. అన్ని రంగాల్లో ఇలాంటి గొడవలు ఉంటుంటాయి. సినిమా రంగంలో కూడా ఇలాంటి గొడవలు అడపాదడపా చోటు చేసుకుంటూనే ఉంటాయి. 

డబ్బు వ్యవహారాల్లో గొడవలు రావడం కామన్. అన్ని రంగాల్లో ఇలాంటి గొడవలు ఉంటుంటాయి. సినిమా రంగంలో కూడా ఇలాంటి గొడవలు అడపాదడపా చోటు చేసుకుంటూనే ఉంటాయి.

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్ధిక లావాదేవీలకి సంబంధించి ఓ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో డిస్ట్రిబ్యూటర్ తో చర్చించాడట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పొత్తు కుదరకపోవడంతో సహనం కోల్పోయిన బెల్లకొండ సురేష్ సదరు డిస్ట్రిబ్యూటర్ పై 
చేయి చేసుకున్నట్లు సమాచారం.

ఈ విషయం బెల్లంకొండ వరకు వెళ్లడంతో ఆయన అలాంటిదేమీ జరగలేదని అంటున్నాడు. మరొక వ్యక్తిని నేను ఎలా కొట్టగలను..? నేను కొడితే అతడు చూస్తూ ఊరుకుంటాడా..? అని ప్రశ్నించాడు బెల్లంకొండ. గిట్టనివారు కావాలని చెడుగా ప్రచారం చేస్తున్నారని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. సదరు డిస్ట్రిబ్యూటర్ తో వాదన జరిగిన సంగతి నిజమేనని కానీ కొట్టడం మాత్రం జరగలేదని అంటున్నాడు. 

ఇందులో ఏది నమ్మాలో అర్ధంకాని పరిస్థితి. ఇది ఇలా ఉండగా.. బెల్లంకొండ సురేష్ తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. కానీ అతడికి మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు. రీసెంట్ గా విడుదలైన 'కవచం' సినిమాకి కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది.   

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి