shannu breakup deepthi: దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్‌ కామెంట్‌.. పచ్చబొట్టు సాక్షిగా..

Published : Dec 26, 2021, 10:59 PM IST
shannu breakup deepthi: దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్‌ కామెంట్‌.. పచ్చబొట్టు సాక్షిగా..

సారాంశం

గత వారం బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు అసలైన్‌ గేమ్‌ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా షణ్ముఖ్‌ వ్యక్తిగత లైఫ్‌ ప్రాబ్లెమ్‌లో పడింది. ఆయన ప్రియురాలు దీప్తి.. షణ్ముఖ్‌ని అన్‌ ఫాలో చేసింది.

బిగ్‌బాస్‌ 5తో పాపులారిటీని సొంతం చేసుకున్నారు యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌. బిగ్‌బాస్‌లో రన్నరప్‌గా నిలిచారు. గెలుపు వరకు వచ్చి ఒక్క అడుగు దూరంలో వెనకబడిపోయాడు. వీజే సన్నీ విన్నర్‌గా నిలిచి బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ విన్నర్‌గా నిలిచారు.  హౌజ్‌లో సిరితో నడిపించే స్నేహం హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరు మంచి స్నేహితులమని చెబుతున్నా, వీరిద్దరు వ్యవహరిస్తున్న తీరు, హగ్గులు జనాలకు మాత్రం రాంగ్‌ వేలో కనెక్ట్ అయ్యింది. వీరిద్దరు ఎమోషనల్‌గానూ కనెక్ట్ అయిపోయినట్టుగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షన్ను, సిరి వ్యవహరించడం అందరికి అనుమానాలను కలిగించింది. 

అదే సమయంలో వీరి వ్యవహారం కూడా ఆడియెన్స్ కి మింగుడు పడలేదు. ఎందుకంటే వీరిద్దరికి అప్పటికే లవర్స్ ఉన్నారు. షణ్ముఖ్‌..హౌజ్‌లోకి వెళ్లడానికి ముందే తన కోస్టార్‌ దీప్తిసునైనాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇద్దరు డీప్‌ లవ్‌లో ఉన్నారు. మరోవైపు సిరి సైతం శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరు హౌజ్‌లో కనెక్ట్ అయినట్టుగా ప్రవర్తించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. 

మొదటి నుంచి తమ మధ్య ఉన్న స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు. అయితే బయట మాత్రం ఈ ఇద్దరిపై నెటిజన్లు ట్రోల్స్ తో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. గత వారం బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు అసలైన్‌ గేమ్‌ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా షణ్ముఖ్‌ వ్యక్తిగత లైఫ్‌ ప్రాబ్లెమ్‌లో పడింది. ఆయన ప్రియురాలు దీప్తి.. షణ్ముఖ్‌ని అన్‌ ఫాలో చేసింది. అంతేకాదు ఆయనకు దూరంగా ఉండాలనే అర్థంతో పోస్ట్ లు పెట్టి షాకిచ్చింది. షణ్ముఖ్‌కి బ్రేకప్‌ చెప్పినట్టేనా అనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై షన్ను స్పందించారు. 

 ఇన్‌స్టాలో లైవ్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునైనా గురించే ఎక్కువగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో ఆయన చెబుతూ, ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని తెలిపారు షన్ను. దీప్తి నా వల్ల చాలా నెగిటివిటీని ఎదుర్కొంది. అయినప్పటికీ నా కోసం నిలబడింది. ఆమెని కచ్చితంగా వెళ్లి కలుస్తాను. మాట్లాడతాను. తనతో బ్రేకప్‌ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు సాక్షిగా.. ఆ పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను` అని తెలిపారు షన్ను. అదే సమయంలో సిరితో తన ఫ్రెండిప్‌ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు షణ్ముఖ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి మూవీలో మోహన్ బాబు పాత్ర, అలా చేసి ఉంటే అట్టర్ ఫ్లాప్.. బిగ్ మిస్టేక్ ఎలా కనిపెట్టారో తెలుసా ?
నాగార్జునను సినిమాల్లోకి వెళ్లమన్నది ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం ?