Nani:“వకీల్ సాబ్” టైంలోనే చేసి ఉంటే..నాని కామెంట్స్!

Surya Prakash   | Asianet News
Published : Dec 26, 2021, 05:00 PM IST
Nani:“వకీల్ సాబ్” టైంలోనే  చేసి ఉంటే..నాని కామెంట్స్!

సారాంశం

. ఆ వాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. ఆ వాఖ్యల వేడిలో ఉండగానే మరోసారి నాని కామెంట్స్ చేసారు.  నాని మళ్ళీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు.   ‘శ్యామ్‌సింగరాయ్‌’రిలీజ్ ముందు రోజు తన సినిమా టీమ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. 

టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు. ఆ వాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. ఆ వాఖ్యల వేడిలో ఉండగానే మరోసారి నాని కామెంట్స్ చేసారు.  నాని మళ్ళీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

నానీ మాట్లాడుతూ...అస్సలు టాలీవుడ్ కి ఈ సమస్య మొదలయ్యింది “వకీల్ సాబ్” నుంచి. అప్పుడే కనుక టాలీవుడ్ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఈపాటికే పరిష్కారం అయ్యిపోయి ఉండేది అని సమస్య అయితే నిజంగా ఉంది కదా? అప్పుడే అందరం ఒక థాటి మీదకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని నాని తెలిపాడు. దీనితో మళ్ళీ నాని చెప్పిన ఈ కీలక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 
ఇక నాని హీరోగా రూపొందిన 'శ్యామ్ సింగ రాయ్' మొన్ననే థియేటర్లకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి సందడి చేశారు. 70వ దశకంలో కలకత్తాలోని దేవదాసీ వ్యవస్థ ప్రధానంగా సాగే కథ ఇది. ఆ దురాచారాన్ని ప్రశ్నించే హీరోగా 'శ్యామ్ సింగ రాయ్' కనిపిస్తాడు.

Also read ys Jagan: జగన్ కు చిరు స్వీట్ వార్నింగ్... వైసీపీ నాయకులకు చిరు కోటింగ్

ఆ దేవదాసీ పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుంది. ఈ ఇద్దరి లుక్స్ కూడా బెంగాలీ ప్రాంతానికి చెందినవిగానే ఉంటాయి. ఇటు నాని లుక్ .. అటు సాయిపల్లవి లుక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. తొలి రోజునే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ లో ఈ సినిమా తొలి రోజున 1.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.

Also read Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్ 2' పవన్ కళ్యాణ్ చేస్తే థియేటర్లు పగిలిపోతాయి.. డైరెక్టర్ కామెంట్స్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?