సన్నీలియోన్ ‘‘మధుబన్’’ సాంగ్‌పై రచ్చ.. ఎట్టకేలకు దిగొచ్చిన సరేగమా, ఆ లిరిక్స్ మారుస్తామని ప్రకటన

Siva Kodati |  
Published : Dec 26, 2021, 07:40 PM IST
సన్నీలియోన్ ‘‘మధుబన్’’ సాంగ్‌పై రచ్చ.. ఎట్టకేలకు దిగొచ్చిన సరేగమా, ఆ లిరిక్స్ మారుస్తామని ప్రకటన

సారాంశం

సన్నీలియోన్ నటించిన ‘‘మధుబన్’’ సాంగ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వుందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాటను నిర్మించిన ‘‘సరేగమా’’ సంస్థ స్పందించింది. హిందూ సంస్థల ఆందోళనలు, మధ్యప్రదేశ్ హోంమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆడియో లిరిక్స్ మారుస్తామని సరేగమా ప్రకటించింది. 

సన్నీలియోన్ నటించిన ‘‘మధుబన్’’ (Madhuban song) సాంగ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వుందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాటను నిర్మించిన ‘‘సరేగమా’’ సంస్థ స్పందించింది. హిందూ సంస్థల ఆందోళనలు, మధ్యప్రదేశ్ హోంమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆడియో లిరిక్స్ మారుస్తామని సరేగమా ప్రకటించింది.

హిందూ మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని తెలిపింది. సన్నీలియోన్ నటించిన ‘‘మధుబన్‌మే నాచే రాధిక’’ వీడియో సాంగ్‌పై దుమారం చెలరేగుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పురోహితుడు ఈ పాటను నిషేధించాలని శనివారం డిమాండ్ చేశారు. మతపరమైన మనోభావాలను బాలీవుడ్ యాక్టర్ దెబ్బ తీస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాటలో అసభ్యకరంగా డ్యాన్స్‌లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హోం మంత్రి నరోత్తం మిశ్రా(Home Minister Narottam Mishra) ఆదివారం సన్నిలియోన్‌(Sunny Leone)కు వార్నింగ్ ఇచ్చారు. సన్నిలియోన్‌తోపాటు సింగర్స్ షారిబ్, తోషిలను హెచ్చరించారు.  ‘మధుబాన్ మే రాధికా, జైసే జంగల్ మే నాచే మోర్’ మ్యూజిక్ వీడియో పట్ల వెంటనే క్షమాపణలు చెప్పాలని నరోత్తం మిశ్రా డిమాండ్ చేశారు. వారు మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పి మ్యూజిక్ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. 

Also Read:సన్నిలియోన్‌కు మధ్యప్రదేశ్ హోం మంత్రి వార్నింగ్.. ఎందుకంటే..!

కొందరు అధర్ములు హిందూ మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నారని నరోత్తం మిశ్రా అన్నారు. హిందువులు రాధా దేవిని ఆరాధిస్తారని, ఈ సాంగ్ వారి మనోభావాలను గాయపరుస్తున్నాయని అన్నారు. అంతకు ముందూ డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్‌పై ఆయన ఇలాగే మండిపడ్డారు. స్వలింప సంపర్క జంట కర్వా చౌత్‌ను వేడుక చేసుకుంటున్న యాడ్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి డిమాండ్ చేశారు. లేదంటే కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇకపోతే  గతవారం విడుదలైన ఈ పాటను షారిబ్, తోషిలు పాడారు. సన్నిలియోన్ నటించారు. ఈ పాటలోని కొన్ని పదాలు 1960లో వచ్చిన కోహినూర్ సినిమాలోని ‘మధుబాన్ మే రాధికా నాచే రే’ పాటతో కలుస్తున్నాయి. ఆ పాటను మొహమ్మద్ రఫీ పాడారు. దివంగత నటుడు దిలీప్ కుమార్ నటించారు.

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?