Trolling on Sunny: సన్నీపై షణ్ముఖ్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆ రెండిటి వల్లే గెలిచాడు అంటూ నిందలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 20, 2021, 04:16 PM IST
Trolling on Sunny:  సన్నీపై షణ్ముఖ్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆ రెండిటి వల్లే గెలిచాడు అంటూ నిందలు

సారాంశం

100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సన్నీ టాప్ 5 కి చేరుకున్న కంటెస్టెంట్స్. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ గ్రాండ్ ఫినాలేలో ఉత్కంఠ క్రియేట్ చేశారు.

100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సన్నీ టాప్ 5 కి చేరుకున్న కంటెస్టెంట్స్. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ గ్రాండ్ ఫినాలేలో ఉత్కంఠ క్రియేట్ చేశారు. అంతా ఊహించినట్లే జరిగింది కానీ ఒక్క శ్రీరామ్ విషయంలోనే అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. 

శ్రీరామ్ ఫైనల్ కి చేరకుండానే నంబర్ 3 గా వెనుదిరిగాడు. దీనితో సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరారు. ఉత్కంఠ నడుమ సన్నీని నాగార్జున విజేతగా ప్రకటించారు. దీనితో సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. సన్నీ అభిమానులు, షణ్ముఖ్ ఫ్యాన్స్, శ్రీరామ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ అభిమాన కంటెస్టెంట్ కోసం క్యాంపైన్ చేశారు. సన్నీ అత్యధిక ఓట్లు సాధించడంతో అతడు విజేతగా నిలిచాడు. 

ముందు నుంచి సన్నీ, షణ్ముఖ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. సన్నీ విజయం సాధించడంతో ఆ వార్ మరింత ఎక్కువైంది. షణ్ముఖ్ ఫ్యాన్స్ సన్నీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. సన్నీ పీఆర్ టీమ్ వల్ల, హౌస్ లో గ్రూపులు క్రియేట్ చేయడం వల్ల గెలిచాడు అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. 

Also Read: వైరల్ ఫోటోస్: విజయ్ దేవరకొండ, రష్మిక రొమాంటిక్ డిన్నర్.. ముంబైలో జంటగా, కంఫర్మ్ చేసినట్లేనా

దీనితో సన్నీ అభిమానులు కూడా షణ్ముఖ్ ఫ్యాన్స్ కి ధీటుగా బదులిస్తున్నారు. హౌస్ లో కేవలం మోజ్ రూమ్ కి మాత్రమే పరిమితమైన షణ్ముఖ్ ఫైనల్ వరకు చేరుకోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు. ఇక షణ్ముఖ్ కి సిరి ఫ్యాక్టర్ కలసి వచ్చిందనే విషయాన్ని మరిచిపోవద్దని అతడి అభిమానులకు సన్నీ ఫ్యాన్స్ ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?