2.0 ఆలస్యానికి కారణలివే.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన శంకర్!

Published : Oct 14, 2018, 05:31 PM IST
2.0 ఆలస్యానికి కారణలివే.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన శంకర్!

సారాంశం

2.0 సినిమా విడుదల తేదీ ఎన్ని సార్లు వాయిదా పడిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ చిత్రం ఆలస్యానికి గల కారణాల్ని వివరించాడు. 

భారతదేశంలోనే అత్యధిక భారీ బడ్జెత్ తో నిర్మించబడుతున్న చిత్రం 2.0. శంకర్ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ ఎన్ని సార్లు వాయిదా పడిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ చిత్రం ఆలస్యానికి గల కారణాల్ని వివరించాడు. 

అసలైతే మొదట కథ కోసం చాలా సమయం తీసుకున్నా. 2.0 టైటిల్ అయితే రోబో సమయంలోనే సీక్వెల్ చేయాలనీ అనుకున్నప్పుడు 2.0 అని ఫిక్స్ అయ్యా. నిజానికి గత ఏడాది క్రితమే సినిమా విడుదల కావాలి. వీఎ‌ఫ్ఎక్స్‌ వర్క్స్ అనుకున్న సమయానికి ఫినిష్ చేస్తామని ఒక పెద్ద కంపెనీ చెప్పిన మాటకు కట్టుబడి మొదట్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ వారు మధ్యలోనే చేతులెత్తేశారు. 2018 జనవరికి పూర్తిచేస్తామని గట్టిగా చెప్పడంతో దుబాయ్ లో ఫంక్షన్ చేశాము. కానీ అప్పుడు కూడా పని పూర్తవ్వలేదు. 

ఇక ఫైనల్ గా అప్పటి పరిస్థితుల్లో హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకం మార్వెల్‌ ఫిల్మ్స్‌కి పనిచేసే ఒక కంపెనీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. గతేడాది ‘బ్లేడ్‌ రన్నర్‌’కి గాను ఆ కంపెనీ ఆస్కార్‌ అవార్డు గెలుచుకుందని వివరణ ఇచ్చాడు. అదే విధంగా సినిమాలో కనిపించే పక్షి డిజైన్ విషయంలో కూడా ఆలస్యం జరిగిందని శంకర్ తెలిపాడు. ఇక ఈ దీపావళికి 2.0 సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌