ఫ్యాన్స్ కు మెగా హీరో మెసేజ్!

By Prashanth M  |  First Published Oct 14, 2018, 4:35 PM IST

సినిమా ఇండస్ట్రీలో విజయాలు వచ్చినప్పుడు స్టార్స్ లో పట్టరాని ఆనందం ఉంటుంది. అయితే దానికంటే ఎక్కువగా ఫ్లాప్స్ వచ్చినప్పుడు బాధ కూడా ఉంటుంది. అయితే తారలు దాన్ని ఎక్కువగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అపజయాన్ని ఒప్పుకునే వారు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు. 


సినిమా ఇండస్ట్రీలో విజయాలు వచ్చినప్పుడు స్టార్స్ లో పట్టరాని ఆనందం ఉంటుంది. అయితే దానికంటే ఎక్కువగా ఫ్లాప్స్ వచ్చినప్పుడు బాధ కూడా ఉంటుంది. అయితే తారలు దాన్ని ఎక్కువగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అపజయాన్ని ఒప్పుకునే వారు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సాయి ధరమ్ తేజ్ కూడా చేరిపోయాడు. 

కెరీర్ మొదట్లో పిల్లా నువ్వు లేని జీవితం - సుప్రీమ్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ మెగా హీరో గత కొంత కాలంగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన తేజ్ ఐ లవ్ యూ సినిమా కూడా బెడిసికొట్టింది. అయితే సోమవారం తన పుట్టినరోజున సందర్బంగా ఈ మెగా హీరో మెగా అభిమానులకు ఒక మెసేజ్ ఇచ్చాడు. 

Latest Videos

undefined

"గెలిచినపుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా మీ చేతుల చప్పట్ల చప్పుడు కూడా తగ్గకుండా జయాపజయాలకూ అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నదివాస్తవం. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాను. 

మీ సలహాలు.. సూచనలను తీసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో ఉన్నాను. మీరు నాపై చూపించే అభిమానమే నన్ను మానసికంగా దృఢంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది’’ అని చెబుతూ.. తన పుట్టినరోజు సందర్బంగా ఎవరు కేక్ కట్టింగ్, బ్యానర్లు కట్టడం లాంటివి చేయకుండా చిన్నారుల చదువు కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తే నేను మరింత సంతోషిస్తానని  సాయి ధరమ్ తేజ్ అభిమానులను కోరాడు. 

click me!