Latest Videos

అతడితో ఇంటిమేట్ సీన్, భయంతో బయటకి పరిగెత్తా.. షాలిని పాండే హాట్ కామెంట్స్ వైరల్

By tirumala ANFirst Published Jun 28, 2024, 8:57 PM IST
Highlights

సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో షాలిని పాండే తో పాటు జునైద్ ఖాన్, జైదీప్  ఆహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు.

సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన మహారాజ్ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో షాలిని పాండే తో పాటు జునైద్ ఖాన్, జైదీప్  ఆహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ గా నటించిన షాలిని పాండే.. ఈ మూవీలో కూడా ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది. 

అయితే ఇంటిమేట్ సీన్స్ లో నటించడం అంత సులభం కాదని షాలిని అంటోంది. ఈ చిత్రంలో జైదీప్ లో శృంగార పరమైన సన్నివేశం ఉంది. ఓ ఇంటర్వ్యూలో షాలిని ఈ విషయాలని బయట పెట్టింది. ఈ చిత్రంలో జైదీప్ తో ఒక శృంగార భరితమైన సన్నివేశంలో నటించాను. 

ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకి పరిగెత్తి పారిపోయాను. చాలా ఒత్తిడిగా అనిపించింది. అలాంటి వాతావరణం, చీకటి ఉన్నప్పుడు నాకు భయం ఎక్కువ. దీనితో నాకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగాను. ఆయన అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చారు. దీనితో ఆ సన్నివేశాన్ని పూర్తి చేయగలిగినట్లు షాలిని పాండే తెలిపింది. 

1800 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జైదీప్ ఈ చిత్రంలో స్త్రీలని అత్యాచారం చేసే పాత్రలో నటించారు. 

click me!