Latest Videos

ప్రభాస్ 'బుజ్జి' కారుకి బన్నీ వైఫ్ ఫిదా.. ఏం చేసిందో చూడండి..

By tirumala ANFirst Published Jun 28, 2024, 7:30 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం మరో పాన్ ఇండియా బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలవబోతోంది. తొలి రోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం. నాగ్ అశ్విన్ బుర్రలో నుంచి వచ్చిన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం మరో పాన్ ఇండియా బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలవబోతోంది. తొలి రోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం. నాగ్ అశ్విన్ బుర్రలో నుంచి వచ్చిన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం. అటు మహాభారతాన్ని.. ఇటు కలియుగాన్ని కనెక్ట్ చేస్తూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి ఆడియన్స్ ని అలరిస్తోంది. 

ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే ఈ చిత్రంలో మరో అట్రాక్షన్ కూడా ఉంది. అదే బుజ్జి కారు. కల్కి చిత్రంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన ఈ కారుకి బయట కూడా సూపర్ క్రేజ్ ఉంది. 

సెలెబ్రిటీలు కూడా ఈ కారుని చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి ఈ కారుపైకి ఎక్కి ఫోజులు ఇచ్చారు. క్రమంగా సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఈ కారుని చూసేందుకు ఎగబడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ బుజ్జి కారులో సందడి చేసారు. కొందరు స్నేహితులతో కలసి ఆమె కారులో సరదాగా ఫోటోలు దిగారు. 

ఆ ఫోటోని అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెతో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఉన్నారు. దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో టెక్ మహీంద్రా సాయంతో నాగ్ అశ్విన్ ఈ కారు తయారు చేయించుకున్నారు. 

click me!