Latest Videos

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్... ఎంత వసూలు చేసిందంటే..? అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్స్..

By Mahesh JujjuriFirst Published Jun 28, 2024, 3:27 PM IST
Highlights

ప్యాన్స్ కు భారీ ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్. కల్కి సినిమాతో విజ్యూవల్ విందు చేశాడు. అయితే ఈమూవీ కలెక్షన్ల మాట ఏంటి..? ఈమూవీ  పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు.. న్యాయం జరిగిందా.... ? 
 

ప్రభాస్ కల్కి  సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా  రిలీజ్ అయ్యింది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిన ఈమూవీ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. రికార్డ్ లు తిరగరాస్తే చూడాలని ఇప్పటికీ ఆశగానే ఉన్నారు. ప్రభాస్ గతంలో సినిమాలను క్రాస్ చేయాలని.. నెంబర్ వన్ స్థాయిలో నిలబడానలని ఆశగా ఎదరుచూస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన కల్కి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను అనౌన్స్ చేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. 

కల్కి సినిమాను  వైజయంతో మూవీస్ బ్యానర్లో అశ్వినిదత్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. ప్రమోషన్స్ లో కూడా ఈ ఇద్దరూ పాల్గొన్నారు. ఇక కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో సందడి చేస్తుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్ చింపేశాయని అంటున్నారు ఫ్యాన్స్. ఈమూవీ కలెక్షన్లు ఎక్కడికో వెళ్లిపోతాయని ఆశపడుతున్నారు.  మంచి సినిమా ఇచ్చాడని  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్నారు.

ఇక నిన్న కల్కి రిలీజ్ అవ్వగా.. ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా సమాచారం ప్రకారం అయితే..ఫస్ట్ డే ఈమూవీ 180 కోట్ల  వరకూ కలెక్ట్ చేయొచ్చు అని చర్చ జరిగింది. అయితే తాజాగా ఈమూవీ కలెక్షన్స్ ను అనౌన్స్ చేశారు మూవీ టీమ్. కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 191.5 క్రోర్స్ కలెక్షన్స్ ను సాధించినట్టు వైజయంతీ మూవీస్ అఫీషయల్ సోసల్ మీడియా పేజ్ లో అనౌన్స్ చేశారు. 

 

𝐋𝐞𝐭’𝐬 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐂𝐢𝐧𝐞𝐦𝐚…❤️‍🔥 pic.twitter.com/Xqn7atEWNF

— Vyjayanthi Movies (@VyjayanthiFilms)

ప్రభాస్ సినిమా రికార్డ్స్ సాధిస్తే చూడాలని అనుకుంటున్న ఫ్యాన్స్. బాహుబల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఆశపడ్డారు. ఇప్పటికి ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఆర్ఆర్ఆర్ మొదటి ప్లేస్ లో ఉండగా.. బాహుబలి రెండో ప్లేస్ లో ఉంది. ఇక ఈ సినిమాలను క్రాస్ చేస్తే చూడాలని అభిమానులు ఆశపడ్డారు. కాని వారి ఆశలు నెరవేరలేదు. 191 కోట్లతో మూడో ప్లేస్ కే  పరిమితం అయ్యింది కల్కి. 

ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే... కల్కి ప్లేస్ దక్కించుకుందా..?

ఇక ఈ లెక్కలు అనౌన్స్ చేయకముందు.. ఈసినిమా నిర్మాత, దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య స్వప్నదత్ చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఆమె  సోషల్ మీడియా పోస్ట్ లో ఆమె ఇలా రాసుకోచ్చారు.  నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీసాం అని పోస్ట్ చేసింది. 

 

pic.twitter.com/85X4CYqNij

— Swapnadutt Chalasani (@SwapnaDuttCh)
click me!