
దాదాపు ఇరవై ఏళ్లపాటు సౌతిండియాలో శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన నటి షకీలా. తన చిత్రాలతో ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల సినిమాలు ఓ టైమ్ లో స్టార్ హీరోల సినిమాలకు కూడా పోటీ వచ్చాయి. ఆ స్దాయిలో వెలుగు వెలిగిన షకీలా జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది.
మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వెండితెరపై ఈ బయోపిక్ ని ఆవిష్కరిస్తున్నారు. షకీలా పాత్రలో హ్యూమా ఖురేషి లేదా స్వర భాస్కర్ వంటి నటీమణులను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఆ పాత్ర బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దాను వరించింది. షకీలా పాత్రలో రిచా చద్దా కనిపించనుంది. రిచాతో షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
‘షకీలా-నాట్ ఎ పోర్న్ స్టార్' పేరుతో ఈ పోస్టర్ విడుదల చేశారు. మన దేశంలో చాలా మందికి షకీలా మీద పోర్న్ స్టార్ అనే అభిప్రాయం ఉంది. ఈ సినిమా ద్వారా ఆమెపై పడ్డ పోర్న్ స్టార్ ఇమేజ్ తుడిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్దమవుతోంది.
షకీలా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్ర యూనిట్ కి తెలిపానని షకీల చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో కనపడనుంది. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్ లంకేష్ కోరడంతో చేస్తున్నారామె.
ఈ సినిమా కోసం రిచా ప్రస్తుతం మలయాళం నేర్చుకుంది. అలాగే షకీలాతో మాట్లాడి ఆమె జీవితం గురించి కూడా తెలుసుకుంది. దక్షిణాది భాషలన్నింటిలోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా ఆ మధ్యన తెరకెక్కిన `డర్టీపిక్చర్` తరహాలో ఈ షకీలా బయోపిక్ కూడా ఆకట్టుకుందని దర్శకర్మాతలు భావిస్తున్నారు.