హన్సిక మ్యారేజ్.. అమ్మ నిర్ణయమే ఫైనల్!

Published : Nov 02, 2018, 10:53 PM IST
హన్సిక మ్యారేజ్.. అమ్మ నిర్ణయమే ఫైనల్!

సారాంశం

లవ్ మ్యారేజ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీలైతే ఆ ఫీలింగ్ ను రుచి చూడకుండా ఉండలేరు అని నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తనకు ప్రేమ వివాహం ఏ మాత్రం ఇష్టం లేదని అంటోంది మిల్కీ బ్యూటీ హన్సికా

లవ్ మ్యారేజ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీలైతే ఆ ఫీలింగ్ ను రుచి చూడకుండా ఉండలేరు అని నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తనకు ప్రేమ వివాహం ఏ మాత్రం ఇష్టం లేదని అంటోంది మిల్కీ బ్యూటీ హన్సికా. 

దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా రాణించడం లేదు గాని కోలీవుడ్ లో అలాగే ఇతర భాషల్లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కెరీర్ ను ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తోంది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హన్సిక తన పెళ్లి గురించి వివరణ ఇచ్చింది. 

తనకు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం లేదని ఆ బాధ్యత మొత్తం మా అమ్మదే అంటూ ఆమె నిర్ణయమే తన నిర్ణయమని అమ్మడు వివరణ ఇచ్చింది. అలాగే ప్రేమ గురించి హన్సిక ఎలాంటి విషయం చెప్పలేదు. అయితే కోలీవుడ్ మీడియాలో మాత్రం ఇప్పటికే హన్సికకు వరుడు సెట్ అయ్యాడని ఆమె తల్లి కుటుంబ సభ్యుల్లో ఒక ప్రముఖ బిజినెస్ మెన్ తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగులో మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాను అంటూ కొన్ని కథలు వింటున్నట్లు హన్సిక తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్