ఆ డైరెక్టర్ పవన్ డబ్బు వృధా చేశాడు.. కోపంతో అరిచేశా: షకలక శంకర్

First Published Jul 10, 2018, 3:19 PM IST
Highlights

75 రోజుల సినిమా షూటింగ్ ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు జూనియర్ ఆర్టిస్టులు ఎంత ఖర్చవుతుందో తెలుసు కదా.. కానీ డైరెక్టర్ మాత్రం వన్ మోర్.. వన్ మోర్ అనేవాడు. అలా వన్ మోర్ అంటూ చాలా డబ్బు తగలేసేవాడు

కమెడియన్ షకలక శంకర్ హీరోగా మారి ఇటీవల 'శంభో శంకర' అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. తనకు నటుడిగా పని దొరకకపోవడంతో హీరోగా పని క్రియేట్ చేసుకున్నానని చెబుతున్నాడు శంకర్. హీరోగా అని కాదు కెమెరా ముందు నటించడమే తనకు ముఖ్యమని ఏ పాత్రలో అయినా నటిస్తానని అన్నాడు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న శంకర్ తన కుటుంబం, జీవితం ఇలా చాలా విషయాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సినిమాల మీద ఆసక్తితో ఇంటి నుండి వచ్చేసిన శంకర్ ఎనిమిదేళ్ల వరకు ఇంటి ముఖం చూడలేదంట. దీంతో అతడు చనిపోయాడనుకొని ఇంట్లో అతడి ఫోటో కూడా పెట్టేశారట. ఇంటికి వెళ్లిన తరువాత అతడిని చూసిన సంతోషపడ్డారని నటుడిగా ఎదిగినందుకు గర్వపడ్డారని చెప్పుకొచ్చాడు. తన అభిమాన నటుడు దైవంగా కొలిచే పవన్ గురించి ప్రస్తావించాడు.

''సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు పవన్ ను రోజు చూడొచ్చనే ఆలోచనతో అంగీకరించాను. 75 రోజుల పాటు ఆయన్ని షూటింగ్ లో చూసిన నాకు తనివి తీరలేదు. ఆయనంటే అంత అభిమానం. ఆ సినిమా షూటింగ్ లో ఆయన నన్ను కోప్పడ్డారు. కళ్యాణ్ బాబు గారి దగ్గర డబ్బులు లేవు. కానీ విలువ కట్టలేనంత రేంజ్ ఆయనది. సర్దార్ సినిమా ఆయన సొంత డబ్బుతో తీశారు. అయితే డైరెక్టర్ మాత్రం తీసిన షాట్లు మళ్లీ మళ్లీ తీస్తూ పవన్ డబ్బును వృధా చేస్తుండడంతో నాకు కోపం వచ్చేది.

75 రోజుల సినిమా షూటింగ్ ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు జూనియర్ ఆర్టిస్టులు ఎంత ఖర్చవుతుందో తెలుసుకు కదా.. కానీ డైరెక్టర్ మాత్రం వన్ మోర్.. వన్ మోర్ అనేవాడు. అలా వన్ మోర్ అంటూ చాలా డబ్బు తగలేసేవాడు. దీంతో ఎన్ని సార్లు ఒకే షాట్ తీస్తావ్.. క్లియర్ గా చెప్పు అని కో డైరెక్టర్ మీద అరిచేశాను. అప్పుడే పవన్ గారు పిలిచి నీ పని నువ్వు చూసుకొని వెళ్లిపో.. డైరెక్టర్, కో డైరెక్టర్ ను అనే స్థాయికి వచ్చేశావా..? అంటూ మందలించారు'' అంటూ స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు. 

click me!