ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్న షారుఖ్ ఖాన్.. వైరల్ అవుతున్నవీడియో..

Published : Sep 01, 2023, 07:16 PM ISTUpdated : Sep 01, 2023, 07:21 PM IST
ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్న షారుఖ్ ఖాన్.. వైరల్ అవుతున్నవీడియో..

సారాంశం

బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు తెలుగు మాట్లాడటం చూస్తూనే ఉంటాం.. కాని బాలీవుడ్ హీరోలు తెలుగు మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా..? అది కూడా  బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తెలుగుమాట్లాడటం విన్నారా..?   

ప్రస్తుతం జనాన్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు.. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్.  ఈసారి సౌత్ ను కూడా టార్గెట్ చేశాడు షారుఖ్. ఇక సౌత్ డైరెక్టర్.. సౌత్ హీరోయిన్.. సౌత్ మ్యూజిక్ డైరెక్టర్, సౌత్ వాసనలతో జవాన్ సినిమాను నిర్మించడంతో పాటు..హీరోగా నటించాడు షారుఖ్. 
ఇక తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. నయనతార హీరోయిన్ గా.. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో .. రూపొందిన సినిమా జవాన్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈసినిమా.. రిలీజ్ కు రెడీగా ఉంది.  సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

తాజాగా ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించుకున్నారు టీమ్. షారుఖ్ ఖాన్ తమిళ వాసనలతో రూపొందిస్తున్న ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక పోతే.. షారుఖ్ కు సబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో షారుఖ్ ఖాన్ ముద్దు మద్దుగా  తెలుగు మాట్లాడుతున్నాడు. 

 

గతంలో షారుక్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన నటించిన 'జీరో' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో షారుక్ మాట్లాడిన వీడియో ఇది. 2018లో జీరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు షారుక్ ఖాన్. ఈ ప్రెస్ మీట్ లో హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ షారుక్‌ని ఓ ప్రశ్న అడిగారు. ఆ సమయంలో హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడిన ఆయన, తర్వాత బాగున్నారా? అని విలేకరి అడగగా.. బాగున్నాను అని తెలుగులో బదులిచ్చాడు. 

అంతే కాదు.. తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.. సిగ్గుపడ్డాడు కూడా..అలాగే  నా పేరు షారుక్ ఖాన్ అంటూ తెలుగులో మాట్లాడి అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నాడు. షారుక్ అలా వచ్చి రాని తెలుగులో మాట్లాడటంతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. 2018లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మరోసారి ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది.  నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ